ప్రేక్షకులే నా శక్తి.. థాంక్యూ మీట్‌లో తేజ సజ్జా ఎమోషనల్ స్పీచ్
సూపర్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకెళ్తోంది.
By: M Prashanth | 13 Sept 2025 7:00 PM ISTసూపర్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకెళ్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్‌వైడ్ రికార్డు స్థాయి కలెక్షన్లతో హౌస్‌ఫుల్ షోస్ సాధిస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ గ్రాండ్‌గా థాంక్యూ మీట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తేజ సజ్జా ఎమోషనల్ గా మాట్లాడాడు. “మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈ విజయానికి కారణం ఆడియన్స్, మీడియా, మా టీమ్ అందరూ. మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను” అంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు రీల్స్ చేసి, సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.
తేజ ప్రత్యేకంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రస్తావించాడు. “ఏ సినిమా అయినా డైరెక్టర్‌తోనే మొదలవుతుంది. కార్తీక్ లేకపోతే మిరాయ్ ఉండేది కాదు. నిర్మాత విశ్వప్రసాద్ గారు మా వెనుక పిల్లర్‌లా నిలబడ్డారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మా అదృష్టం” అని చెప్పాడు. అలాగే మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రీయ, జగపతి బాబు వంటి నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాకింగ్ స్టార్ మనోజ్ మంచు కూడా ఈ కార్యక్రమంలో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. “దాదాపు 12 ఏళ్ల తర్వాత నా ఫోన్ సక్సెస్ మెసేజెస్‌తో మోగిపోతోంది. ఇది కలలా అనిపిస్తోంది. నన్ను ఈ కథలో భాగం చేసిన కార్తీక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ గారి ప్యాషన్ అద్భుతం. తమ్ముడు తేజ భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడు” అని మనోజ్ పేర్కొన్నాడు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, “2017లో మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జర్నీ మొదలైంది. కానీ 2024లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయికి రాలేదు. అలాంటి సమయంలో మిరాయ్ మాకు మళ్లీ ఎనర్జీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆడియన్స్ నుంచి అద్భుతమైన క్రెడిబిలిటీ సంపాదించాం. ఇది మాకు పెద్ద విజయమే” అని తెలిపారు. మొత్తం మీద, మిరాయ్ థాంక్యూ మీట్ టీమ్ అందరికీ ఒక భావోద్వేగ క్షణంగా మారింది. తేజ సజ్జా తన ఎమోషనల్ స్పీచ్‌తో ఫ్యాన్స్ హృదయాలను తాకగా, మనోజ్ మంచు, విశ్వప్రసాద్, కార్తీక్ ఘట్టమనేని, రితికా నాయక్ అందరూ ఈ విజయంలో తమ పాత్రను గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులే నిజమైన హీరోలు అని తేజ మరోసారి రుజువు చేశాడు.
