రివ్యూస్ మీద నో డిబేట్స్.. మిరాయ్ కే అది సొంతం!
రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకుపైగా రాబట్టింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిందని చెప్పాలి.
By: M Prashanth | 22 Oct 2025 12:23 PM ISTఇటీవల థియేటర్స్ తో పాటు ఓటీటీలో సినీ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రాల్లో మిరాయ్ కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. యంగ్ హీరో తేజ సజ్జా కీలక పాత్రలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా.. గత నెలలో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే.
అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కంటెంట్ తో తెరకెక్కిన మిరాయ్ మూవీ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను, చిన్నారులను విపరీతంగా మెప్పించింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకుపైగా రాబట్టింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిందని చెప్పాలి.
అటు రివ్యూయర్స్.. ఇటు ఆడియన్స్ నుంచి మొత్తం పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. అలా జరగడం ఈ మధ్యకాలంలో ఇదే అయింటుంది. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా.. రివ్యూస్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటున్నాయి. కొన్ని సార్లు ఆడియన్స్ రివ్యూస్ తో సింక్ కావడం లేదు. రివ్యూస్ పై డిబేట్స్ కూడా భారీగా జరుగుతున్నాయి.
కానీ మిరాయ్ మూవీకి మాత్రం ఏకధాటిగా పాజిటివ్ గానే వచ్చాయి. అది కూడా ఎలాంటి డిబేట్స్ లేకుండానే. ఇప్పుడు అదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రవిశంకర్ యలమంచిలి కూడా చెప్పారు. రీసెంట్ గా మిరాయ్ మేకర్స్.. హైదరాబాద్ లో బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ ను నిర్వహించారు.
ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రవిశంకర్ మాట్లాడుతూ, "మిరాయ్ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా. రిలీజ్ అయిన రోజు పొద్దున్న 5 గంటలకు రివ్యూస్ వచ్చాయి. కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నాయి. అమెరికా రివ్యూయర్స్ సహా అంతా ఏకధాటిగా మంచి రేటింగ్ ఇచ్చారు. ఎలాంటి గోల లేదు. అలాగే ఆడియన్స్ తో సింక్ అయింది" అని అన్నారు.
"ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా రేటింగ్స్ కు న్యాయం చేసేలా వసూళ్లు కూడా అలానే వచ్చాయి. అంతా హ్యపీగా ఉన్నారు. అది చాలా మంచి విషయం. లేని పోని డిబేట్లు లేకుండా హ్యాపీగా, స్మూత్ గా ఓ ప్రొడ్యూసర్ కు సినిమా మంచి సక్సెస్ ఉంది. సినిమాకు అన్ని తోడ్పడ్డాయి. వెల్ డన్ విశ్వప్రసాద్ సర్. కీప్ ఇట్ అప్" అని నవీన్ తెలిపారు.
"మీ నుంచి ఫ్యూచర్ లో రానున్న సినిమాలు మ్యాసివ్ హిట్లు అవ్వాలని కోరుకుంటున్నా. ది రాజా సాబ్ సహా వివిధ చిత్రాలు విజయం సాధించాలని ఆశిస్తున్నా. మంచి ప్యాషన్ ఉన్న మీ లాంటి నిర్మాతలు ఇంకా ఇండస్ట్రీలో షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
