మిరాయ్ మూడు రోజుల బాక్సాఫీస్.. టోటల్ ఎంతంటే?
కంటెంట్ తో వచ్చిన సినిమాలకు జనాలు బ్రహ్మరథం పడటారని మరోసారి రుజువు చేసింది మిరాయ్ సినిమా.
By: M Prashanth | 15 Sept 2025 12:41 PM ISTకంటెంట్ తో వచ్చిన సినిమాలకు జనాలు బ్రహ్మరథం పడటారని మరోసారి రుజువు చేసింది మిరాయ్ సినిమా. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది. సూపర్ హీరో సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటూ అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది.
రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మిరాయ్.. రెండో రోజు, మూడో రోజుకి వసూళ్లు పెంచుకుని వరుస విజయాలను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతుండగా, ఓవర్సీస్‌లోనూ సినిమా అదే రేంజ్‌లో రాంపేజ్ చేస్తోంది. థియేటర్లలో ఫ్యామిలీస్, యూత్, కిడ్స్ అందరూ బాగా ఆస్వాదిస్తూ మౌత్ టాక్ తోనే సినిమాపై హైప్ పెంచుతున్నారు.
ముఖ్యంగా మూడో రోజుకి వరల్డ్ వైడ్‌గా సినిమా కలెక్ట్ చేసిన మొత్తం వసూళ్లు రూ.81.2 కోట్ల గ్రాస్ దాటేయడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. నార్త్ అమెరికాలో సినిమా ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్ల మైలురాయిని అందుకుంది. ఇక హిందీ బెల్ట్‌లో మాత్రం రూ.10 కోట్ల పైగా వసూళ్లు సాధించడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు హిందీ బెల్ట్‌లో ఇంత స్థాయి వసూళ్లు సాధించిన వారు టాలీవుడ్‌లో టాప్ ఫోర్ స్టార్స్ మాత్రమే. అలాంటిది తేజ సజ్జా స్థాయిలో ఉన్న హీరోకి ఇది రికార్డ్ అని చెప్పొచ్చు.
సూపర్ హీరో కాన్సెప్ట్‌కి టాలీవుడ్‌లో ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం కొత్త రికార్డులకి నాంది పలికింది. మిరాయ్ విజయం వెనుక ఉన్న బలమైన స్క్రీన్‌ప్లే, విజువల్స్, సూపర్ హీరో ఎమోషన్‌తోపాటు తేజ సజ్జా పెరుగుతున్న ఫ్యాన్ బేస్ ప్రధాన కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే దేశం నలుమూలలా, విదేశాల్లోనూ మిరాయ్ కి డిమాండ్ పెరుగుతూనే ఉంది.
ఇక ఈ సినిమా లో విలన్‌గా మనోజ్ మంచు పోషించిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ మంచి ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. ఆయన ఎనర్జీ, తేజ సజ్జా పెర్ఫార్మెన్స్‌కి సరైన కాంపిటీషన్ ఇస్తోంది. అలాగే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్‌గా ఇచ్చిన విజువల్ ట్రీట్, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద మూడో రోజుకి మిరాయ్ వసూళ్లు ఇండస్ట్రీకి ఒక కొత్త దిశ చూపించాయి. తెలుగు సినిమా పరిధిని మించి, పాన్ ఇండియా లెవెల్లో తేజ సజ్జా పేరు బలంగా వినిపించేట్టు చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.
