ప్లాన్ మార్చిన తేజ సజ్జా.. ఇది పర్ఫెక్ట్ ప్లాన్
నిజానికి 'మిరాయ్' క్లైమాక్స్ లోనే సీక్వెల్ కు సంబంధించిన లీడ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కథనే డెవలప్ చేసి, మరింత భారీ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.
By: M Prashanth | 31 Dec 2025 12:00 AM IST'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన యంగ్ హీరో తేజ సజ్జ, ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'మిరాయ్' సూపర్ యోధ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, యాక్షన్ లవర్స్ కు ఒక విజువల్ ఫీస్ట్ లా నిలిచింది. కేవలం మౌత్ టాక్ తోనే సినిమా పుంజుకుని ఏకంగా 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం మామూలు విషయం కాదు.
ఈ విజయంతో తేజ మార్కెట్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. 'హనుమాన్' విజయం గాలివాటం కాదని, కంటెంట్ ఉంటే ఎంతటి విజయాన్నైనా అందుకోగలనని 'మిరాయ్' తో నిరూపించాడు. అయితే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే, తేజ తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'జాంబి రెడ్డి 2' ఇప్పుడు తెరపైకి వస్తుందని భావించారు.
అయితే ఫ్యాన్స్ కు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 'జాంబి రెడ్డి 2' ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్ లో పడిందట. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల ఇప్పట్లో 'జాంబి రెడ్డి' సీక్వెల్ కు డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా పక్కన పెట్టారని టాక్.
దీంతో తేజ సజ్జ వెంటనే మరో నిర్ణయం తీసుకున్నాడు. 'మిరాయ్' సినిమాకు వచ్చిన రెస్పాన్స్, కలెక్షన్స్ చూసి ఆ జోరును అలాగే కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే 'జాంబి రెడ్డి 2' స్థానంలో 'మిరాయ్ 2' ని లైన్ లో పెట్టాడని తెలుస్తోంది. మొదటి భాగం ఇంత పెద్ద హిట్ అవ్వడంతో, దానికి సీక్వెల్ తీస్తే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని టీమ్ నమ్ముతోంది. కార్తీక్ ఘట్టమనేని కూడా స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
నిజానికి 'మిరాయ్' క్లైమాక్స్ లోనే సీక్వెల్ కు సంబంధించిన లీడ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కథనే డెవలప్ చేసి, మరింత భారీ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఫస్ట్ పార్ట్ 140 కోట్లు కొల్లగొట్టింది కాబట్టి, సెకండ్ పార్ట్ మీద బిజినెస్ సర్కిల్స్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఏదేమైనా తేజ కెరీర్ ప్లానింగ్ చాలా పక్కాగా కనిపిస్తోంది. ఒక సీక్వెల్ ఆగినా, మరో సూపర్ హిట్ సీక్వెల్ తో ఆడియెన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు వరుసగా 100 కోట్ల సినిమాలతో స్టార్ హీరోగా ఎదుగుతున్న తేజ ప్రయాణం నిజంగా గ్రేట్. మరి 'మిరాయ్ 2' తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
