సీక్వెల్ కోసం 3 ఏళ్లు ఆగాల్సిందే..?
తేజ సజ్జ మిరాయ్ సినిమా అతని ఖాతాలో మరో సూపర్ హిట్ ఇచ్చింది. యూఎస్ లో 1 మిలియన్ తో పాటు ఓవరాల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరి అదరగొట్టేసింది.
By: Ramesh Boddu | 20 Sept 2025 12:44 PM ISTతేజ సజ్జ మిరాయ్ సినిమా అతని ఖాతాలో మరో సూపర్ హిట్ ఇచ్చింది. యూఎస్ లో 1 మిలియన్ తో పాటు ఓవరాల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరి అదరగొట్టేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జతో పాటు మంచు మనోజ్ కూడా నటించాడు. సినిమాలో తిరిక నాయర్, శ్రీయ శరణ్ లు ఇంపార్టెంట్ రోల్ చేశారు. సినిమాపై ముందు నుంచి బజ్ ఉండగా రిలీజైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఐతే మిరాయ్ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకు హ్యూజ్ క్రేజ్ తీసుకొచ్చింది.
రానా ఎంట్రీ కూడా సర్ ప్రైజ్..
సినిమా చూసిన రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ వాయిస్ ని సూపర్ ఎంజాయ్ చేశారు. ఐతే సినిమా చివర్లో మిరాయ్ 2 కూడా అనౌన్స్ చేశారు. అందులో రానా విలన్ గా నటిస్తాడన్న క్లూ కూడా ఇచ్చాడు. రానా ఎంట్రీ కూడా సినిమాలో సర్ ప్రైజ్ చేసింది. ఐతే అది ఎండ్ టైటిల్స్ లో కాకుండా ఇంకాస్త ముందు పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇదిలాఉంటే మిరాయ్ 2 సినిమా అనౌన్స్ అయితే చేశారు కానీ అది చేయడానికి చాలా టైం పట్టేలా ఉందనిపిస్తుంది.
ఎందుకంటే మిరాయ్ సీక్వెల్ కన్నా ముందు కార్తీక్ ఆల్రెడీ కమిటైన మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమా కెమెరా వర్క్ చేయాలి. మరోపక్క తేజ సజ్జ ఆల్రెడీ జాంబి రెడ్డి 2 చేయాల్సి ఉంది. జాంబి రెడ్డి ఫుల్ లెంగ్త్ రోల్ కాగా.. జై హనుమాన్ అదే హనుమాన్ 2 సినిమాలో కూడా తేజ సజ్జ కచ్చితంగా ఉంటాడనిపిస్తుంది. ఈ రెండు సీక్వెల్స్ తీసిన తర్వాతే తేజ సజ్జ మిరాయ్ 2 చేసే ఛాన్స్ ఉంది.
2028 లో మిరాయ్ 2..
ఐతే కార్తీకేయ రీసెంట్ ఇంటర్యూలో మిరాయ్ 2 కి రెండేళ్లు టైం పడుతుందని అన్నాడు. అంటే సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికే దాదాపు 2027 దాకా వెళ్తుందట. నెక్స్ట్ సినిమా రిలీజ్ మరో ఏడాది అవుతుంది. సో 2028 లో మిరాయ్ 2 ఉండే ఛాన్స్ ఉంది. మిరాయ్ 2 చూడాలంటే మరో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మిరాయ్ 2 మరో లెవెల్ లో ఉంటుందని అంటున్నాడు కార్తీక్ ఘట్టమనేని.
తేజ సజ్జ కూడా ఈ 2, 3 ఏళ్లలో జాంబి రెడ్డి 2తో పాటు జై హనుమాన్ పూర్తి చేస్తాడు. మిరాయ్ 2 లో తేజ సజ్జ రానాతో ఢీ కొడుతున్నాడు. మిరాయ్ 1 లో మంచు మనోజ్ ని ఢీ కొట్టిన తేజ ఈసారి భళ్లాలదేవతో ఫైట్ చేయబోతున్నాడు.
