కుమార్తె విషయంలో ఇదేం కన్ప్యూజన్!
ఓటీటీ ప్రియులకు 'స్ట్రేంజింగ్ థింగ్స్' వెబ్ సిరీస్ గురించి పరిచయం అవసరం లేదు.
By: Srikanth Kontham | 25 Aug 2025 7:00 PM ISTఓటీటీ ప్రియులకు `స్ట్రేంజింగ్ థింగ్స్` వెబ్ సిరీస్ గురించి పరిచయం అవసరం లేదు. ఇందులో ఎల్ అలియాస్ ఎలవెవన్ లీడ్ రోల్ లో మిల్లీ బాబ్ బ్రౌన్ ఆద్యంతం తన నటనతో ఓ రేంజ్ లో ఆకట్టుకుం టుంది. ఈ అమ్మడు హాలీవుడ్ సినిమాలతోనూ ఫేమస్ అయిననటే. వృత్తిపరంగా మిల్లీ కెరీర్ కి తిరుగుల లేదు. సినిమాలు...సిరీస్ లతో బిజీగానే ఉంది. వ్యక్తిగత జీవితంలో చికాకులు కనిపిస్తున్నాయి. మిల్లీ కొన్నా ళ్లుగా జెక్ బోంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది. అటుపై గత ఏడాది అక్టోబర్ లోనే వివాహం కూడా చేసుకుందీ జోడీ.
ప్రకటించినా ఒప్పుకోని పరిస్థితి:
అప్పటికి మిల్లీ వయసు 20 ఏళ్లు మాత్రమే. దీంతో చిన్న వయసులోనే పెళ్లి ఏంటి? అనే విమర్శలు జాతీయ మీడియాలో హైలైట్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ ఏడాదిలోనే తల్లిగా మారినట్లు ప్రకటించింది. అయితే ఈ బిడ్డను ఆమె కన్నదా? దత్తత తీసుకుందా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇక్కడే ఎన్నో సందే హాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లీ దత్తత తీసుకున్నట్లు వెల్లడించింది. కానీ ఈ విషయాన్ని చాలా మంది అంగీకరించడం లేదు. తాను కన్న బిడ్డనే దత్తత తీసుకున్నట్లు అబద్దాలాడుతుందనే వాదన నెట్టింట సాగుతోంది.
దత్త బిడ్డా? కన్న బిడ్డా?
నటిగా తన ప్రయాణానికి గర్భం దాల్చడం..ప్రసవించడం వంటివి కెరీర్ పరంగా అవకాశాలు రావనే కార ణంగా దత్త బిడ్డగా ప్రకటించిందని జాతీయ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కథ నాలను నమ్మాలా? మిల్లీ ప్రకటనని నమ్మాలో అర్దం కాక అంతా డైలమాలో పడుతున్నారు. బిడ్డ విష యంలో ఎవరైనా అబద్దం చెబుతారా? అని ఓసెక్షన్ మిల్లీకి మద్దతుగా నిలుస్తోంది. అందుకు ధీటైన సమాధానాలు తెరపైకి వస్తున్నాయి. మిల్లీ నిజంగా దత్తత తీసుకుంటే ఎక్కడ నుంచి తీసుకుంది? చట్టపరంగా ఉన్న డాక్యుమెంట్లు మీడియా ముందు ఉంచాలి? అని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
క్లారిటీ ఇచ్చేదెప్పడు?
అప్పుడే సోషల్ మీడియాలో జరుగుతోన్న అన్నిరకాల ప్రచారాలకు పుల్ స్టాప్ పడుతుందని పోస్టులు పెడుతున్నారు. మిల్లీ నిజంగా దత్తత తీసుకుంటే? ఆ డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే సరి. లేదంటే ఈ ప్రచారం ఎంతదూరమైనా వెళ్తుందా? ఎన్ని సందేహాలకు అయినా తావిచ్చినట్లు అవుతుంది. మరి మిల్లీ దీనిపై మరో ప్రకటనతో మీడియా ముందుకొస్తుందా? మౌనంగానే ఉంటుందా? అన్నది చూడాలి.
