Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి త‌టాకంలో ఒక చిన్న చేప‌ను మాత్ర‌మే.. కోడ‌లు మిహీక వ్యాఖ్య‌లు!

సెలబ్రిటీ హోదా ఉన్నా.. తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికే రానా.. తాను ఇష్టపడతామని మిహీకా ఈ సందర్భంగా వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   20 April 2026 9:21 AM IST
ద‌గ్గుబాటి త‌టాకంలో ఒక చిన్న చేప‌ను మాత్ర‌మే.. కోడ‌లు మిహీక వ్యాఖ్య‌లు!
X

దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిప్రాయాలను .. ఒక కోడ‌లిగా దగ్గుబాటి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఎంతో హుందాగా పంచుకున్నారు. ముఖ్యంగా ఆ కుటుంబ వారసత్వం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. దగ్గుబాటి కుటుంబం తమ లెగసీని దశాబ్దాల కష్టంతో స్వయంగా నిర్మించుకుందని మిహీకా పేర్కొన్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కుటుంబంలోకి రావడం తనకేమీ ప్రత్యేక హోదాను ఇచ్చిందనే అహంకారం త‌న‌లో ఎక్కడా కనిపించలేదు.

``ఆ కుటుంబం నిర్మించుకున్న మహా సముద్రం లాంటి లెగసీలో నేను ఒక చిన్న చేపను మాత్రమే`` అని మిహీక‌ చేసిన వ్యాఖ్య త‌న‌లోని ప‌రిణ‌తి, వినమ్రతకు అద్దం పడుతోంది. తనకంటూ ఒక సొంత గుర్తింపు ఉన్నా.. ఆ కుటుంబ గౌరవానికి ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారు. దగ్గుబాటి వారి కోడలిగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉన్నా.. తన వృత్తిపరమైన బాధ్యతలు .. తనకంటూ ఉన్న లక్ష్యాల విష‌యంలో మిహీక ఎంతో స్పష్టతతో ఉన్నారు. ఇంటీరియర్ - ఈవెంట్ డిజైనింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడానికి ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు.

సెలబ్రిటీ హోదా ఉన్నా.. తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికే రానా.. తాను ఇష్టపడతామని మిహీకా ఈ సందర్భంగా వెల్లడించారు. తన వృత్తిపరమైన ఎదుగుదలలో రానా ఇచ్చే మద్దతు.. ప్రోత్సాహం ఎంతో విలువైనవని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం ఒక సెలబ్రిటీ భార్యగా మాత్రమే కాకుండా.. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఎదగడానికి ఆ కుటుంబం ఇచ్చే స్వేచ్ఛను మిహీక‌ కొనియాడారు. నిరంతరం వార్తల్లో ఉండటం కంటే.. తన పని ద్వారా గుర్తింపు పొందడమే తనకు ఇష్టమని కూడా ఓ ఇంట‌ర్వ్యూలో మిహీక‌ స్పష్టం చేశారు.

దగ్గుబాటి కుటుంబం వంటి ప్రతిష్టాత్మక నేపథ్యం ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇమేజ్‌ను మోయడం ఒక బాధ్యతగా మిహీక‌ భావిస్తున్నారు. ఆమె మాటల్లో ఎక్కడా కృత్రిమత్వం లేకుండా.. అత్యంత సహజంగా .. విజ్ఞతతో మాట్లాడటం విశేషం. ఈ సంభాషణ ద్వారా మిహీకా కేవలం ఒక స్టార్ వైఫ్ మాత్రమే కాదని..స్పష్టమైన వ్యక్తిత్వం .. వృత్తి పట్ల గౌరవం ఉన్న ఆధునిక మహిళ అని నిరూపించుకున్నారు. మిహీక‌ వినమ్రత, స్పష్టత నేటి తరం యువతకు ముఖ్యంగా సెలబ్రిటీ కుటుంబాల్లోకి అడుగుపెట్టే వారికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.

బలమైన సామాజిక- సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు ఒక మహిళ తనకంటూ ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకోవడం అనేది సవాలు.. సులభతరం అనే రెండు కోణాల కలయికగా ఉంటుంది. ఆ కుటుంబం ఇచ్చే సామాజిక హోదా, ఆర్థిక వెసులుబాటు, విస్తృతమైన పరిచయాలు ఒక అద్భుతమైన వేదికను కల్పిస్తాయి. ఇది వృత్తిపరమైన ఎదుగుదలను వేగవంతం చేస్తుంది. అయితే అదే సమయంలో సదరు కుటుంబం భారీ వారసత్వం ఒక నీడలా వెంటాడుతూ.. వ్యక్తిగత విజయాలను కూడా కుటుంబ ప్రభావంగానే చూసే సామాజిక దృక్పథం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యతను పాటిస్తూ.. ఆ కుటుంబ గౌరవానికి భంగం కలగకుండా తన సొంత ప్రతిభతో గుర్తింపు తెచ్చుకోవడానికి రెట్టింపు కృషి చేయాల్సి ఉంటుంది. మిహీక అన్నివిధాలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగ‌డం త‌న‌లోని గొప్ప వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రిస్తోంది.