Begin typing your search above and press return to search.

ఇండియన్‌ ప్రేక్షకులు ఎవరికీ అర్థం కారు..!

బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌... ఇలా ఏ వుడ్ తీసుకున్నా సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటున్నాయి.

By:  Ramesh Palla   |   23 April 2026 12:19 PM IST
ఇండియన్‌ ప్రేక్షకులు ఎవరికీ అర్థం కారు..!
X

బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌... ఇలా ఏ వుడ్ తీసుకున్నా సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ సక్సెస్‌ రేటు మరీ దారుణంగా ఉంది. గతంతో పోల్చితే సక్సెస్‌ రేటు మరీ దారుణంగా పడిపోయింది. రూపొందుతున్న సినిమాల సంఖ్యతో పోల్చితే హిట్‌ అవుతున్న సినిమాల సంఖ్య ఏమాత్రం సరిపోలడంలేదు. వందల సంఖ్యలో సినిమాలు రూపొందుతూ ఉంటే, కనీసం పదుల సంఖ్యలో కూడా సినిమాలు హిట్ కావడం లేదు. భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు కనీసం బజ్‌ క్రియేట్‌ చేయలేక పోతున్నాయి. ఆ మధ్య ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందినప్పటికీ మినిమం ఓపెనింగ్‌ దక్కించుకోలేదు. వారం ముందు అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు పెట్టినా ప్రేక్షకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

హాలీవుడ్‌ మూవీ మైకేల్‌ రిలీజ్‌...

ఇండియన్‌ సినిమాలకు లేని క్రేజ్‌ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు వచ్చినప్పుడు మాత్రం తెగ బజ్ క్రియేట్‌ అవుతోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హాలీవుడ్‌ మూవీ 'మైఖేల్‌' కి ఇండియాలో రికార్డ్‌ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేవలం ఇంగ్లీష్ వర్షన్‌ మాత్రమే ఇండియాలో రిలీజ్ కాబోతుంది. మైఖేల్‌ సినిమాను ఎవరు చూస్తారులే అనుకున్నారో ఏమో కానీ కనీసం హిందీ భాషలో కూడా డబ్‌ చేయలేదు. సాధారణంగా హాలీవుడ్‌ సినిమాలు హిందీతో పాటు సౌత్‌లో అన్ని భాషల్లోనూ డబ్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ మైఖేల్‌ ను మాత్రం ఇండియాలో కేవలం ఇంగ్లీష్ వర్షన్‌లో మాత్రమే విడుదల చేస్తున్నారు. అయినా కూడా ఇండియన్‌ ప్రేక్షకులు మైఖేల్‌ను ఇంగ్లీష్ లో చూడటం కోసం పెద్ద ఎత్తున టికెట్లు ఇప్పటికే బుక్‌ చేసుకున్నారు. ప్రీమియర్‌ షో లతో భారీ మొత్తంలో వసూళ్లు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

మైకేల్‌ జాక్సన్‌ బయోపిక్‌...

మైకేల్‌ జాక్సన్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఆయన చనిపోయి దాదాపు 17 ఏళ్లు అవుతోంది. అప్పట్లో ఆయనను అభిమానించిన వారు ఇప్పుడు అటు ఇటుగా వృద్ధులు అయ్యి ఉంటారనే అభిప్రాయం ఉంది. కానీ మైకేల్‌ జాక్సన్‌ బయోపిక్‌కి ఈ స్థాయిలో అడ్వాన్స్‌ బుకింగ్‌ జరగడం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఈతరం యువత కూడా మైకేల్‌ జాక్సన్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని, అందుకే ఆయన బయోపిక్‌ మైకేల్‌ ను చూసేందుకు రెడీ అవుతున్నారని ఈ బుకింగ్‌ ట్రెండ్‌ చూస్తే అర్థం అవుతోంది. సాదారణంగా బయోపిక్‌లకు పెద్దగా బజ్‌ ఉండదు అంటారు. కానీ మైకేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ మాత్రం పూర్తి భిన్నంగా అన్నట్లుగా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలో మైకేల్‌ మూవీ లాంగ్‌ రన్‌లోనూ భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇండియాలో మైకేల్‌ జాక్సన్‌ క్రేజ్‌...

భారీ బడ్జెట్‌ సినిమాలు, క్రేజీ కాంబినేషన్‌లతో వచ్చిన సినిమాలకు సైతం ఇండియన్‌ ప్రేక్షకులు పెద్దగా అడ్వాన్స్‌ బుకింగ్‌ వసూళ్లు కట్టబెట్టిన దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. అలాంటిది ఎప్పుడో చనిపోయిన మైకేల్‌ జాక్సన్‌ బయోపిక్‌కి భారీ ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్‌ వసూళ్లు కట్టబెట్టడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందని సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ సినీ ప్రేక్షకుల నాడి ఏంటో ఏ ఒక్కరికీ అర్థం కాదని మరోసారి మైకేల్‌ సినిమాకు ఉన్న బజ్‌ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే ఇండియాకు చెందిన గొప్ప నాయకుడు లేదా ఫ్రీడం ఫైటర్స్‌ బయోపిక్‌ తీస్తే ఈ స్థాయిలో ఆధరణ, బజ్‌ ఉంటుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రేక్షకుల మైండ్‌ ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేక పోతున్నారు. అందుకే చాలా మంది సినిమాలు తీసి ఫెయిల్‌ అవుతున్నారు.