Begin typing your search above and press return to search.

'మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నా'.. మియా ఖలీఫా క్లారిటీ ఇచ్చిందిలా..

అయితే ఆ పుకార్లపై తాజాగా మియా ఖలీఫా స్పందించి నిజం బయటపెట్టారు. తాను ఓ మార్ఖుడితో డేటింగ్ చేస్తున్నానని, కానీ అది మిస్టర్ బీన్ కాదని తెలిపారు.

By:  M Prashanth   |   22 Jan 2026 10:24 PM IST
మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నా.. మియా ఖలీఫా క్లారిటీ ఇచ్చిందిలా..
X

మియా ఖలీఫా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అడల్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ అయిన ఆమె.. ఇప్పుడు దానితో సంబంధం లేకుండా సోషల్ మీడియా సెలబ్రిటీగా, పబ్లిక్ ఫిగర్‌ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే ఆమె.. ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బీన్‌ గా అభిమానులు ట్రీట్ చేసే బ్రిటిష్ నటుడు రోవన్ అట్కిన్సన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు వయసులో భారీ తేడా ఉన్నా రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నారని, ఫ్రాన్స్‌ లో లగ్జరీయస్ షిప్స్ పై కలిసి విహరిస్తున్నారని కొన్ని ఫోటోలు వైరల్‌ గా మారాయి. దీంతో అవి చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. నిజమేనా? అసలు ఎలా సాధ్యం? అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు జోక్ గా తీసుకున్నారు.

కానీ కొద్ది గంటల్లోనే ఆ మొత్తం వ్యవహారంలో అసలు విషయం బయటపడింది. నిజానికి ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీ.. రీసెంట్ గా రోవన్ అట్కిన్సన్, మియా ఖలీఫా కలిసి ఉన్నట్లుగా కనిపించే ఫోటోలను షేర్ చేసింది. “మిస్టర్ బీన్ తన హీరోయిన్‌ ను కనుగొన్నాడు” అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది. అయితే ఆ ఫోటోలు నిజమైనవి కావు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేసిన చిత్రాలు.

ఆ విషయం తెలియని చాలా మంది వాటిని నిజమని భావించి షేర్ చేయడంతో ఆ వార్త వైరల్‌ గా మారింది. దీంతో ఊహాగానాలు అప్పటి నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ పుకార్లపై తాజాగా మియా ఖలీఫా స్పందించి నిజం బయటపెట్టారు. తాను ఓ మార్ఖుడితో డేటింగ్ చేస్తున్నానని, కానీ అది మిస్టర్ బీన్ కాదని తెలిపారు. అంతేకాదు, ఆ వార్తను ఖండించిన మరో పోస్ట్‌ ను రీ-షేర్ చేస్తూ ఇలాంటి ప్రతిపాదనపై అభ్యంతరం లేదని జోక్ చేశారు.

ఇప్పుడు మియా ఖలీఫా పోస్ట్ వైరల్ గా మారడంతో.. పుకార్లపై క్లారిటీ వచ్చింది. అయితే నిజానికి ఆమెతోపాటు రోవన్ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు. రోవన్ అట్కిన్సన్ 2013 నుంచి నటి లూయిస్ ఫోర్డ్‌ తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ఒక చిన్న కుమార్తె కూడా ఉంది. మరోవైపు మియా ఖలీఫా ప్రస్తుతం మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి వివరాలు బయటపెట్టలేదు.

మొత్తానికి మియా, రోవన్ డేటింగ్ రూమర్ సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదాన్ని నమ్మకూడదనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఫోటోలు, వీడియోలు కనిపించగానే అవి నిజమేనని అనుకోవడం ఎంత తప్పో క్లియర్ గా చెబుతోంది. ఏదమైనా మిస్టర్ బీన్, మియా ఖలీఫా ప్రేమాయణం అంటూ ప్రచారం జరిగిన ఊహాగానాలకు చెక్ పడింది.