Begin typing your search above and press return to search.

మల్లెపూలు తెచ్చిన తంటా.. హీరోయిన్ కి లక్ష ఫైన్!

అయితే ఇలాంటి మల్లెపూలు ఇప్పుడు ఒక హీరోయిన్ కు ఏకంగా లక్ష ఫైన్ వేసేలా చేశాయి.. ఏంటీ? మల్లెపూలు.. హీరోయిన్ కి లక్ష ఫైనా? అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది అక్షరాల నిజమే..

By:  Madhu Reddy   |   8 Sept 2025 1:58 PM IST
మల్లెపూలు తెచ్చిన తంటా.. హీరోయిన్ కి లక్ష ఫైన్!
X

మల్లెపూలు.. సువాసన భరితమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగించడమే కాకుండా మగువల అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఈ మల్లెపూలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి మల్లెపూలు ఇప్పుడు ఒక హీరోయిన్ కు ఏకంగా లక్ష ఫైన్ వేసేలా చేశాయి.. ఏంటీ? మల్లెపూలు.. హీరోయిన్ కి లక్ష ఫైనా? అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది అక్షరాల నిజమే.. మరి ఇది ఎక్కడ జరిగింది? అసలు ఆ హీరోయిన్ ఏం చేసింది? ఆమెకు లక్ష ఫైన్ ఎందుకు? ఎవరు విధించారు? అంటూ ప్రజలు నుంచీ ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మూర మల్లెపూలు.. హీరోయిన్ కి లక్ష ఫైన్..

విషయంలోకి వెళ్తే.. ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా నవ్య నాయర్ మెల్బోర్న్ కి వెళ్ళింది.. ఎయిర్పోర్టులో ఆ మల్లెపూలను గుర్తించిన సిబ్బంది.. అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి అధికారులు ఈమెకు ఈ మొత్తంలో జరిమానా వేశారు. అయితే ఈ విషయంపై మెల్బోర్న్ లో జరిగిన ఈ ఓనం కార్యక్రమంలో నవ్య నాయర్ మాట్లాడుతూ.." నేను తీసుకొచ్చిన మల్లెపూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించే వరకు నాకు తెలియదు" అంటూ చమత్కరించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అక్కడి భద్రతా కారణంగా వారు ఫైన్ విధించారు. ఆ విషయం తెలియని నవ్య నాయర్ ఏకంగా మూర మల్లెపూల కోసం లక్ష రూపాయలు నష్టపోయింది అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఫైన్ ఎందుకు విధించారంటే?

ఇకపోతే ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలు కలిగిన విమానాశ్రయాలలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ఇక్కడ పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం నిషిద్ధం. అందుకే ప్రయాణికులు సాధ్యమైనంత వరకు వీటిని తమతో తీసుకెళ్లడానికి ఇష్టపడరు.. వీటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. ఇక్కడి వరకు అంతానే బాగున్న ఈ విషయం తెలియని ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి కష్టమ్ అధికారులు ఆమె బ్యాగ్ లో మల్లెపూలను తీసుకువచ్చిందని తెలిసి ఆమెకు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా వేశారు.

నవ్య నాయర్ కెరియర్..

నవ్య నాయర్ విషయానికి వస్తే.. ప్రముఖ మలయాళ నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో, నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. మలయాళంలోనే కాదు కన్నడ, తమిళ్ భాష చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో సినిమాలలో మెప్పించి, పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఎక్కువగా మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈమె .. వివాహం తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది.