అగ్గి రాజేస్తున్న మెహ్రీన్ రెడ్ హాట్ లుక్
కాలం సాగుతూనే ఉంటుంది. అది ఎవరికోసమో ఆగదు. మిగిలి ఉన్న కాలంలో ఏం సాధించామన్నదే ఇక్కడ ముఖ్యం.
By: Sivaji Kontham | 11 Nov 2025 9:35 AM ISTకాలం సాగుతూనే ఉంటుంది. అది ఎవరికోసమో ఆగదు. మిగిలి ఉన్న కాలంలో ఏం సాధించామన్నదే ఇక్కడ ముఖ్యం. ఇది రంగుల ప్రపంచంలో నటీమణులకు వర్తిస్తుంది. అందాల నటి మెహ్రీన్ ఫీర్జదా కెరీర్ పై ఎన్నో హోప్స్‌తో ముందుకు సాగుతోంది. కెరీర్ లో నవతరం హీరోలతో పాటు, అగ్ర హీరోల సరసనా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. కాజల్ తర్వాత మళ్లీ అంతటి అందమైన నవ్వు మోము మెహ్రీన్ సొంతమని అభిమానులు కితాబిచ్చేస్తుంటారు.
అయితే కాజల్ అగర్వాల్ అంతటి పెద్ద హీరోయిన్ గా ఎదగడంలోన ఈ బ్యూటీ తడబడింది. కెరీర్ పరంగా ఆశించినది జరగకపోయినా, కనీసం వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలనే ప్రయత్నం కూడా సఫలం కాకపోవడం నిరాశపరిచింది. ఇంతకుముందు పెళ్లితో లైఫ్ లో సెటిలవ్వాలని భావించినా కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ అయింది.
ఇటీవల సినీ కెరీర్ కూడా ఆశించినంతగా లేదు. రెండేళ్ల క్రితం `స్పార్క్ లైఫ్` అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో విక్రాంత్ సరసన నాయికగా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం ఇంద్ర సన్ నెక్ట్స్ లో విడుదలైంది. ఇవేవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా సినీ కెరీర్ గురించి అంతగా దిగులు చెందలేదని మెహ్రీన్ చెబుతోంది. తన వ్యక్తిగత ఆనందాన్ని మించినది లేదని ఈ బ్యూటీ నమ్ముతోంది. కొన్నిటికి దారులు మూసుకుపోయినా, మెహ్రీన్ మాత్రం పాజిటివ్ యాటిట్యూడ్ తో ఇతరులలో స్ఫూర్తి నింపుతోంది. ఇప్పటికీ నటిగా తన ప్రయత్నాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
ఇటీవల ఎక్కువ సమయం ప్రయాణాలతో గడుపుతున్నానని, ఫోటోలు తీసుకోవడం, సరదాగా గడిపేయడమే తన జీవన విధానం అని మెహ్రీన్ చెప్పకనే చెబుతోంది. ఈ భామ తాజా ఫోటో క్లిక్స్ తో అభిమానులను అలరించేందుకు వచ్చింది. ఇన్ స్టా ఫీడ్ నుంచి రెడ్ హాట్ డ్రెస్ లో ఫోజులిచ్చిన కొన్ని ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. మూడు పదుల వయసులో మెహ్రీన్ పూర్తి పరిణతి చెందిన బ్యూటీ. తనదైన అందం, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. అద్భుతమైన ఎరుపు రంగు గౌనులో మెహ్రీన్ అందం మరింత ఇనుమడించింది. భారీ రాజప్రాకారంలో మెహ్రీన్ రాణిలా కనిపిస్తోంది. నేపథ్యంలో అద్భుతమైన కోట ధేధీప్యమైన కాంతులతో మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. మెహ్రీన్ అందచందాలకు యువతరం ఎప్పటిలాగే ఫిదా అవుతోంది. చక్కనమ్మ రెడ్ హాట్ థై స్లిట్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తోంది.
