Begin typing your search above and press return to search.

పెళ్లి వార్త‌ల‌పై ఫైర్ అయిన మెహ‌రీన్

నేను ఫ‌లానా వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్టు వార్త‌లు రాస్తున్నారు. కానీ నేనెవ‌రినీ పెళ్లి చేసుకోలేదు, ఫ్యూచ‌ర్ లో పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయిన‌ప్పుడు ఆ విష‌యాన్ని స్వ‌యంగా నేనే ప్ర‌పంచానికి తెలియ‌చేస్తా.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Dec 2025 1:22 PM IST
పెళ్లి వార్త‌ల‌పై ఫైర్ అయిన మెహ‌రీన్
X

2016లో నాని హీరోగా వ‌చ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ‌గాధ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ప‌రిచ‌య‌మయ్యారు పంజాబీ బ్యూటీ మెహ‌రీన్. త‌క్కువ టైమ్ లోనే ప‌లు సినిమాల్లో న‌టించిన మెహ‌రీన్ ఆ త‌ర్వాత ఎఫ్2లో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టించి ఆ సినిమాలో హ‌నీ ఈజ్ ది బెస్ట్ అనే డైలాగ్ తో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకున్న మెహ‌రీన్ హీరోయిన్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

గ‌తంలో భ‌వ్య బిష్ణోయ్ తో ఎంగేజ్‌మెంట్

అయితే 2021 మార్చిలో హ‌ర్యానాకు చెందిన భ‌వ్య బిష్ణోయ్ తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. బీజీపీ త‌ర‌పున అడంపూర్ అసెంబ్లీకి బిష్ణోయ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కానీ కొన్ని తెలియని కార‌ణాల వ‌ల్ల వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవ‌డంతో పెళ్లి ర‌ద్దైంది. ఇక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ గ‌త కొన్నాళ్లుగా మెహ‌రీన్ పెళ్లి మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నార‌ని వార్త‌లొస్తున్నాయి.

ప‌రిచ‌య‌మే లేని వ్య‌క్తితో పెళ్లి అని వార్త‌లు

ఈ వార్త‌ల‌పై తాజాగా మెహ‌రీన్ స్పందిస్తూ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న‌క‌స‌లు ప‌రిచ‌య‌మే లేని వ్య‌క్తితో పెళ్లి జ‌రిగింద‌ని వార్త‌లు రాయ‌డంపై ఆమె మండిప‌డుతూ, గ‌త రెండేళ్లుగా ఇలాంటి విష‌యాల‌పై మౌనంగానే ఉన్నాన‌ని, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ‌క త‌ప్ప‌డం లేద‌ని చెప్తూ ఈ మేర‌కు మెహ‌రీన్ త‌న సోష‌ల్ మీడియాలో ఓ నోట్ ను రిలీజ్ చేశారు.

నా పెళ్లి వార్త నేనే చెప్తా

నేను ఫ‌లానా వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ట్టు వార్త‌లు రాస్తున్నారు. కానీ నేనెవ‌రినీ పెళ్లి చేసుకోలేదు, ఫ్యూచ‌ర్ లో పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయిన‌ప్పుడు ఆ విష‌యాన్ని స్వ‌యంగా నేనే ప్ర‌పంచానికి తెలియ‌చేస్తా. ద‌య చేసి నా పెళ్లి గురించి ఎలాంటి ప్ర‌చారాలు చేయొద్ద‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. ఇక కెరీర్ విష‌యానికొస్తే ఎఫ్3 త‌ర్వాత మెహ‌రీన్ స్పార్క్ అనే తెలుగు సినిమా చేశారు. మ‌ధ్య‌లో ఓ వెబ్ సిరీస్ కోసం ఎక్కువ టైమ్ కేటాయించ‌డం వ‌ల్లే కెరీర్లో గ్యాప్ వ‌చ్చింద‌ని, తాను కావాల‌ని గ్యాప్ తీసుకోలేద‌ని చెప్పిన మెహ‌రీన్ ప్ర‌స్తుతం క‌న్న‌డలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.