పిక్‌టాక్ : మెహ్రీన్ మళ్లీ మెరిసింది
సాధారణంగా హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటారు, తద్వారా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటారు.
By: Ramesh Palla | 6 Aug 2025 9:00 PM ISTతెలుగు ప్రేక్షకులకు 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈ అమ్మడు తెలివి ఉపయోగించలేదు అనే విమర్శలు ఉన్నాయి. వచ్చిన ఆఫర్‌లను ఒప్పేసుకుంటూ వెళ్లింది. కానీ కాస్త పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్‌లు, స్టార్ హీరోలు అని బేరీజు వేసుకుంటూ సినిమాలు చేసి ఉంటే, కథల విషయంలో కాస్త సీరియస్‌గా ఉండి కమిట్ అయ్యి ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. మెహ్రీన్ అందానికి మరికొన్నాళ్లు ఇండస్ట్రీలో బిజీగా ఉండాల్సింది. కానీ ఆమె సినిమాలు నిరాశ పరచడం, వరుస ఫ్లాప్స్ కారణంగా మెహ్రీన్ మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతుంది. కాని ఆమె మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.
బ్లూ డ్రెస్‌లో మెరిసిన మెహ్రీన్ కౌర్
సాధారణంగా హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటారు, తద్వారా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటారు. అందులో భాగంగానే హీరోయిన్స్ ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తమ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. మెహ్రీన్ సైతం రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందమైన మినీ డ్రెస్ ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే మెహ్రీన్ ఈ ఫోటోల్లోనూ భలే క్యూట్‌గా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెహ్రీన్ కౌర్ బ్లూ డ్రెస్‌లో భలే ముద్దు వస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ఇంత అందంగా ఉన్న మెహ్రీన్ ను ఎందుకు ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు కొందరు ఉన్నారు.
టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రయత్నాలు
స్లీవ్ లెస్ బ్లూ డ్రెస్ లో మెహ్రీన్ మెరిసి పోతుంది. క్లీ వేజ్ షో చేస్తూ, థైస్ అందాలను చూపిస్తూ మతి పోగొడుతోంది. ఈ స్థాయి అందాల ఆరబోతను మెహ్రీన్ గతంలో ఎన్నో సార్లు చేసింది. అయితే ఎప్పుడూ చాలా కొత్తగానే మెహ్రీన్ కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి అందమైన ఫోటోలు ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడితే ఖచ్చితంగా ఈమెకు సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఛాన్స్ దక్కవచ్చు. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, మళ్లీ తెలుగు, తమిళ సినిమాలతో బిజీ కావాలని ఆశ పడుతున్నట్లు మెహ్రీన్ సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌ల్లోనూ ఈమె నటిస్తుందా అనేది చూడాలి.
మోడలింగ్ తో ఇండస్ట్రీలో అవకాశం
పంజాబ్‌లోని సిక్కు ఫ్యామిలీలో జన్మించిన మెహ్రీన్ కౌర్ పదేళ్ల వయసులోనే స్కూల్ లో ర్యాంప్ వాక్ చేసింది. అంతే కాకుండా అందాల పోటీల్లో కసౌలి ప్రిన్సెస్ టైటిల్‌ను గెలుచుకుంది. కెనడాలోని టొరంటో మిస్ సర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా 2013 కిరీటంను గెలుచుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మోడల్‌గా చాలా షో లో పాల్గొన్న మెహ్రీన్ పలు కిరీటాలను సొంతం చేసుకుంది. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సినిమాల్లో ఆఫర్లు దక్కాయి. తెలుగులో ఈమె నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. నాని సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ద్వారా మెహ్రీన్ కి మంచి ఇమేజ్ బిల్డ్ అయింది. కానీ మెహ్రీన్ ఎక్కువ కాలం స్టార్‌గా నిలబడలేక పోయింది.
