మెహర్ రమేష్.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడి ఉంటే..
ఆ తరువాత ఎన్టీఆర్ స్వయంగా పిలిచి కంత్రి సినిమాతో టాలీవుడ్ లో మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ అప్పట్లో యూత్ కు కనెక్ట్ అయ్యాయి.
By: M Prashanth | 5 Aug 2026 12:21 PM ISTఇండస్ట్రీలో ఒకప్పుడు తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు మెహర్ రమేష్. కానీ ఇప్పుడు ఒక్క సక్సెస్ కోసం ఎంతలా కష్టపడుతున్నారో తెలిసిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న అతని జర్నీలో శక్తి సినిమా చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క సినిమా తెచ్చిన నెగెటివిటీ కెరీర్ ను దారుణంగా దెబ్బతీసింది. కనీసం ఆ ప్రాజెక్ట్ ను అనుకున్న ఒరిజినల్ కథతో తీసి ఉన్నా రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది.
డైరెక్టర్ గా మారకముందు ఇండస్ట్రీలో మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అయిన పోకిరి, దేశముదురు లాంటి సినిమాల స్క్రిప్ట్ వర్క్ లో ఆయన పెన్ను పవర్ కూడా ఉంది. ఆ అనుభవంతోనే కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ మెగా ఫోన్ పట్టుకున్నారు. మన దగ్గర పూరి జగన్నాథ్ తీసిన ఆంధ్రావాలా, గుణశేఖర్ తీసిన ఒక్కడు లాంటి సినిమాలను అక్కడ రీమేక్ చేసి సాలిడ్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు.
ఆ తరువాత ఎన్టీఆర్ స్వయంగా పిలిచి కంత్రి సినిమాతో టాలీవుడ్ లో మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ అప్పట్లో యూత్ కు కనెక్ట్ అయ్యాయి. ఆ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో జనాలకు చూపించుకోవడానికి ఆ ప్రాజెక్ట్ చాలా బాగా హెల్ప్ అయింది.
కంత్రి తర్వాత ప్రభాస్ తో చేసిన బిల్లా రమేష్ రేంజ్ ను అమాంతం పెంచేసింది. అది ఒక రీమేక్ సినిమానే అయినా, తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో చాలా మంచి మార్పులు చేశారు. ప్రభాస్ ను అప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఓ హాలీవుడ్ హీరో రేంజ్ లో చాలా స్టైలిష్ గా స్క్రీన్ మీద చూపించారు. ఆ సినిమా ప్రెజెంటేషన్, మేకింగ్ వాల్యూస్ చూసి ఇండస్ట్రీ అంతా ఫిదా అయింది. దాంతో టాలీవుడ్ లో స్టైలిష్ డైరెక్టర్ అనే ఇమేజ్ పూర్తిగా సొంతమైపోయింది.
బిల్లా తెచ్చిన ఆ క్రేజ్ తోనే మళ్లీ ఎన్టీఆర్ తో చేసిన భారీ ప్రాజెక్టే శక్తి. ఆ సినిమాకు బడ్జెట్ లిమిట్ లేకపోవడం, అసలు కథలో అనవసరమైన మార్పులు చేయడం కెరీర్ కు పెద్ద శాపంగా మారింది. అసలు స్క్రిప్ట్ ను పక్కన పెట్టి, జగదేక వీరుడు లాంటి సినిమా చేయాలని ట్రై చేసి దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆ సినిమా పరాజయం అతని మీద వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. అక్కడి నుంచి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఆ ఒక్క మిస్టేక్ ఆయన కెరీర్ ను పదేళ్ల వెనక్కి నెట్టేసింది.
శక్తి ఇచ్చిన షాక్ నుంచి బయటపడటానికి ఆయన ఇన్నేళ్లుగా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఎప్పటికైనా కమ్ బ్యాక్ ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి నమ్మి భోళా శంకర్ తో ఒక పెద్ద అవకాశం ఇచ్చారు. చిరంజీవి లాంటి మెగా హీరో సపోర్ట్ దొరికినా కూడా ఆ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం వర్కౌట్ కాలేదు.
