ఫేమస్ సాంగ్ సంచలన సిరీస్ లో రీక్రియేషన్!
`మీర్జాపూర్` కథాంశం ఉత్తరప్రదేశ్ నేపథ్యానికి సంబంధించింది కాబట్టి అక్కడి గ్యాంగ్‌స్టర్ల లైఫ్ స్టైల్‌లో ఇలాంటి క్లాసిక్ ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.
By: Srikanth Kontham | 22 March 2026 1:06 PM ISTభారతీయ చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ క్లాసిక్ `షోలే`సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ ఒక ఐకానిక్ ముద్ర వేసింది. ముఖ్యంగా `మెహబూబా మెహబూబా` పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ చార్ట్‌బస్టర్. హెలెన్ డ్యాన్స్, ఆర్.డి. బర్మన్ అదిరిపోయే సంగీతం, ఆయన గొంతులో వైవిధ్యం పాటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా దశాబ్దాల తర్వాత ఐకానిక్ సాంగ్‌ను అత్యంత క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ `మీర్జాపూర్` ను మూవీ గా మలుచుతోన్న నేపథ్యంలో? అందులో రీక్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం.
`మీర్జాపూర్` అంటేనే ఓ రకమైన రా అండ్ రస్టిక్ ఫీల్. కలీన్ భయ్యా, గుడ్డు భయ్యా వంటి పాత్రలతో అలరించిన ఈ సిరీస్ వెండితెరపై సినిమా రూపంలో రాబోతోంది. ఈ భారీ ప్రాజెక్టులో ప్రేక్షకులకు ఒక అదిరిపోయే కిక్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే `షోలే`లోని `మెహబూబా` సాంగ్‌ను నేటి కాలానికి తగ్గట్టుగా ఒరిజినల్ ఫీల్ చెడిపోకుండా రీక్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ రీమిక్స్ లేదా రీక్రియేషన్ అనేది మీర్జాపూర్ సినిమాకు ఓ మేజర్ అట్రాక్షన్ కానుంది. ఈ పాటను రీక్రియేట్ చేయడం వెనుక మరో బలమైన కారణం ఉంది.
`మీర్జాపూర్` కథాంశం ఉత్తరప్రదేశ్ నేపథ్యానికి సంబంధించింది కాబట్టి అక్కడి గ్యాంగ్‌స్టర్ల లైఫ్ స్టైల్‌లో ఇలాంటి క్లాసిక్ ఐటమ్ సాంగ్స్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. `షోలే` సినిమాలోని రా అండ్ రస్టిక్ వాతావరణానికి, మీర్జాపూర్ లోని ఇంటెన్సిటీకి ఒక పోలిక ఉంది. అందుకే ఈ పాటను సినిమాలోని ఓ కీలకమైన సందర్భంలో కలీన్ భయ్యా లేదా ఇతర గ్యాంగ్ ల సంబరాల సమయంలోప్రదర్శించే అవకాశం ఉంటుంది. అయితే హెలెన్ వంటి గ్రేట్ డాన్సర్ చేసిన ఆ మ్యాజిక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. దీని కోసం ఒక టాప్ గ్లామర్ హీరోయిన్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కేవలం డాన్స్ మాత్రమే కాకుండా సాంగ్ మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒరిజినల్ సాంగ్ లోని ఆ హస్కీ వాయిస్ , బీట్స్‌ను అలాగే ఉంచుతూ నేటి సౌండ్ సిస్టమ్స్ కు తగ్గట్టుగా రీమిక్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది క్లాసిక్ సాంగ్స్ ను టచ్ చేయకపోవడమే మంచిదంటుంటే? మరికొందరు మాత్రం `మీర్జాపూర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సాంగ్ పక్కాగా సెట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కరణ్ జోహార్ వంటి అగ్ర నిర్మాతలు గతంలో క్లాసిక్ సాంగ్స్ ను రీమిక్స్ చేసినప్పుడు అవి చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు `మీర్జాపూర్` మేకర్స్ కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తారని ఆశిస్తున్నారు.
