చంద్రహాస్ 'హీరోయిన్'.. అలా అనేసిందేంటి?
ముఖ్యంగా తన డెబ్యూ మూవీ రామ్ నగర్ బన్నీ మూవీ రిలీజ్ కు ముందు చాలా నెగెటివిటీ ఎదుర్కొన్నాడు.
By: M Prashanth | 2 Feb 2026 11:07 AM ISTప్రముఖ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు, రామ్ నగర్ బన్నీ ఫేమ్ చంద్రహాస్ గురించి తెలిసిందే.. సాధారణంగా ఎవరైనా హీరో అయ్యాక ట్యాగ్ వస్తుంది.. ట్రోలింగ్ బారిన పడతారు.. కానీ చంద్రహాస్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వకుండానే యాటిట్యూడ్ స్టార్ అయిపోయాడు.. చూడడానికి హీరో కటౌట్ తో పాటు మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న చంద్రహాస్ ను అంతా అలాగే పిలుస్తున్నారు.
ముఖ్యంగా తన డెబ్యూ మూవీ రామ్ నగర్ బన్నీ మూవీ రిలీజ్ కు ముందు చాలా నెగెటివిటీ ఎదుర్కొన్నాడు. తన సినిమా ఈవెంట్ లో అతడి ఎక్స్ప్రెషన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అదే సమయంలో చంద్రహాస్ ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. చంద్రహాస్ కు షాక్ ఇచ్చింది.
అయితే ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు పాపులర్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ సపోర్ట్ గా నిలిచారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమె రీసెంట్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈవెంట్ లో హోస్ట్ మేఘన దగ్గరికి వచ్చి.. చంద్రహాస్ గురించి ఒక మాట చెప్పాలంటే, ఏం చెబుతారని అడగ్గా.. ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చింది. బరాబర్ యూటిట్యూడ్ ఉందని చెప్పుకొచ్చింది. అప్పుడే హోస్ట్ కూడా బరాబర్ చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ అని అనగా.. ఈవెంట్ కు వచ్చిన వారంతా నవ్వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతూ.. హీరోయిన్ కూడా అలా అనేసిందేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని.. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగే లవ్ స్టోరీని మేకర్స్ చూపించబోతున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ చెప్పకనే చెబుతోంది.
ఫిబ్రవరి 6న థియేటర్లలో సినిమా విడుదల కానుండగా.. చంద్ర హాస్, మేఘనా ముఖర్జీతోపాటు అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్ సహా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. మరి బరాబర్ ప్రేమిస్తా మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
