Begin typing your search above and press return to search.

రీల్స్ కోసం బెంజి లోంచి దూకిన న‌టి చివ‌రికి

రీల్స్ కోసం రైలు కింద ప‌డిన ప్ర‌భుద్ధుల‌ను, లోయ‌లోకి జారి ప‌డిన వారిని లేదా జూలో పులి నోట్లో త‌ల‌కాయ పెట్టిన బాప‌తు ప్ర‌జ‌ల్ని మ‌నం చూస్తున్నాం.

By:  Sivaji Kontham   |   8 Dec 2025 12:42 AM IST
రీల్స్ కోసం బెంజి లోంచి దూకిన న‌టి చివ‌రికి
X

రీల్స్ కోసం రైలు కింద ప‌డిన ప్ర‌భుద్ధుల‌ను, లోయ‌లోకి జారి ప‌డిన వారిని లేదా జూలో పులి నోట్లో త‌ల‌కాయ పెట్టిన బాప‌తు ప్ర‌జ‌ల్ని మ‌నం చూస్తున్నాం. ఇన్ స్టా రీల్స్ పేరుతో క్రేజీగా ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవాల‌నే ఆత్రంలో ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్న‌వారు ఎంద‌రో. కొంద‌రికి శాశ్వ‌త అంగ వైక‌ల్యం కూడా దాపురించింది.




ఇదిలా ఉంటే, ఇప్పుడు ర‌న్నింగ్ లో ఉన్న బెంజి కార్ నుంచి దిగి, దాని ప‌క్క‌న న‌డుస్తూ అడ్వెంచ‌ర్ కి ప్ర‌య‌త్నించింది వైర‌ల్ క్వీన్ మేఘనా కౌర్. కార్ డోర్ తెరిచి జంప్ చేసి, ర‌న్నింగ్ లో ఉన్న కార్ వెంటే న‌డుస్తూ, చివ‌రికి తిరిగి త‌న డ్రైవింగ్ సీల్ లోకి చేరుకుంది. ఇది నిజంగా ప్ర‌మాద‌క‌ర‌మైన ఫీట్. ఇలాంటి అడ్వెంచ‌ర్ ని ఎంకరేజ్ చేయ‌కూడ‌దు అంటూ సోష‌ల్ మీడియాలో జ‌నం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అంతేకాదు ముంబై పోలీసుల‌కు ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ, చాలా మంది చాలా ర‌కాలుగా శాప‌నార్థాలు పెట్టారు. దీంతో ఇప్పుడు మేఘా కౌర్ నేరుగా బ‌రిలోకి దిగి వారంద‌రినీ శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తాను ఉద్ధేశ‌పూర్వ‌కంగా ఎవ‌రికీ హాని క‌లిగించాల‌ని అనుకోలేద‌ని, అయినా ఇలాంటి ఫీట్ ని ఎవ‌రూ అనుక‌రించ‌వ‌ద్ద‌ని మేఘా కోరింది. ఆ స్థ‌లంలో ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత‌, ఎవ‌రికీ ఇబ్బంది లేని ప్లేస్ లోనే ఇలా చేసాన‌ని తెలిపింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదనేది తన ఉద్దేశ్యం అని ఆమె నొక్కి చెప్పింది.

అయితే త‌న కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్న వ్య‌క్తుల‌తో మాట్లాడుతూ.. వీడియోలో నంబర్ ప్లేట్ కూడా కనిపించడం లేదని.. దానిని తన వాహనానికి లింక్ చేయడం ద్వారా తనను అపఖ్యాతి పాల్జేయ‌వద్దని ప్రజలను అభ్యర్థించింది. తన సొంత సి క్లాస్ బెంజ్ కార్ వైపు చూపిస్తూ పోస్ట్‌లు పెడుతున్న‌వారిని ఉద్ధేశించి మేఘా ఒక వివ‌ర‌ణ ఇచ్చింది. తాను సత్యానికి కట్టుబడి ఉన్నానని, ఎవరినీ ప్రమాదంలో పడేయాలని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొంది. ఫ్యాష‌న్, బ్యూటీ రంగం స‌హా సినీరంగంలో మేఘ‌నా పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీ. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఏవో కొత్త పోస్టుల‌తో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది. బాలీవుడ్లోను న‌టించేందుకు మేఘ‌నా ప్ర‌య‌త్నాలు చేస్తోంది.