Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్‌ సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?

చిరంజీవి హోస్ట్‌గా ‘మెగావర్స్‌’ టాక్‌ షో నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది. ఇప్పటికే మూడు, నాలుగు ఎపిసోడ్స్‌ షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. మొదటి సీజన్‌లో 10 నుంచి 12 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగాలతో ఓ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే షో స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

By:  Ramesh Palla   |   28 Nov 2026 10:01 AM IST
మెగా ఫ్యాన్స్‌ సంక్రాంతి వరకు వెయిట్‌ చేయాల్సిందేనా?
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్‌ సూపర్‌ హిట్ అయిన విషయం తెల్సిందే. దాంతో మెగా ఫ్యాన్స్‌ సైతం చాలా కాలంగా మెగాస్టార్‌ చిరంజీవి టాక్‌ షో కోసం ఎదురు చూస్తున్నారు. చిరంజీవి టాక్‌ షో వస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఫైనల్‌గా ఓటీటీ ద్వారా మెగాస్టార్‌ చిరంజీవి టాక్‌ షో రాబోతుంది. ఇంతకు ముందు చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరులు షో కు హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్లకు మెగావర్స్‌ అనే టాక్‌ షో తో రాబోతున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్‌ పూర్తి అయింది, త్వరలోనే ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగలతో ఒక ఎపిసోడ్‌ ను చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌ అయితే జరుగుతుంది, కానీ ఎప్పటి నుంచి మెగావర్స్ రాబోతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ అవుతోంది.

మెగాస్టార్‌ టాక్‌ షో మెగావర్స్‌...

నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ చేయబోతున్న ఈ మెగాస్టార్‌ టాక్‌ షో మెగావర్స్‌ను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఆమె ఇప్పటికే వెబ్‌ సిరీస్‌లు, సినిమాలను నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆమె తన గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో ఈ టాక్‌ షో ను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె నుంచి కూడా స్ట్రీమింగ్ గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మొదటి సీజన్‌ ను 10 నుంచి 12 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్‌ చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ మొత్తం ఎపిసోడ్స్ చిత్రీకరణ చేసిన తర్వాత ఒక్కో ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయా అని కొందరు అంటున్నారు. అయితే ఇంతకు ముందు టాక్‌ షో లను చూస్తే మూడు నాలుగు ఎపిసోడ్స్ చిత్రీకరణ చేసిన తర్వాత వాటిని వారం వారం స్ట్రీమింగ్‌ చేస్తూ మధ్యలో కొత్త ఎపిసోడ్‌ ను చిత్రీకరణ చేయడం జరిగేది. కనుక చిరంజీవి టాక్‌ షో విషయంలోనూ అలాగే జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

విశ్వంభర సినిమాతో చిరంజీవి...

చిరంజీవి ఈ సంక్రాంతికి కాకా సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. కాకాతో పాటు విశ్వంభర సైతం విడుదల ఉంటుందని అంటున్నారు. ఈ రెండు సినిమాల విడుదలతో పాటు సంక్రాంతికి మెగావర్స్ టాక్‌ షో సైతం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది. సంక్రాంతి కంటే ముందే అంటే క్రిస్మస్‌ లేదా న్యూ ఇయర్‌ సందర్భంగా కూడా మెగావర్స్‌ స్ట్రీమింగ్‌ మొదలు అయ్యే అవకాశాలు లేకపోలేదు అని కొందరు అంటున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్నా టాక్‌ షో స్ట్రీమింగ్‌కు ఎక్కువ సమయం లేదు, అతి త్వరలోనే మొదటి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ప్రతి వారం ఒక ఎపిసోడ్‌ చొప్పున మెగావర్స్‌ ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్‌ చేసింది. ఈ టాక్‌ షో కు గాను చిరంజీవి భారీ పారితోషికం అందుకుంటున్నాడని, నెట్‌ఫ్లిక్స్ నుంచి పెద్ద మొత్తం అందబోతుందనే వార్తలు వస్తున్నాయి.

సంక్రాంతికి కాకా సినిమాతో చిరంజీవి..

మెగావర్స్‌ టాక్‌ షో ప్రతి ఎపిసోడ్‌ చాలా స్పెషల్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. సాధారణంగానే అందరితోనూ చాలా జోవియల్‌గా ఉండే మెగాస్టార్ టాక్ షో కోసం మరింత జోవియల్‌గా మారడం ఖాయం అని, గెస్ట్‌లతో సరదా ముచ్చట్లు, ఆటలు, పాటలు కచ్చితంగా మెగావర్స్‌ ప్రతి ఎపిసోడ్‌ టాక్‌ ఆఫ్‌ది ఇండిస్ట్రీగా నిలవడం ఖాయం అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి కాకా, విశ్వంభర సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాల నిర్మాతలు సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకోవడంతో పంచాయితి చిరంజీవి వద్దకు వెళ్లిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఏదో ఒక సినిమాను సంక్రాంతి బరి నుంచి తొలగించి సమ్మర్‌లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి రాబోయే రోజుల్లో మెగా ఫ్యాన్స్‌కి సినిమాలు, టాక్‌ షో తో పండగే పండగా అనడంలో సందేహం లేదు.