విశ్వంభర నైజాం హక్కులు ఎవరికంటే..?
టీజర్ లోని వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని విశ్వంభరను దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
By: Sravani Lakshmi Srungarapu | 22 Aug 2025 12:28 PM ISTవరుస డిజాస్టర్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేస్తోన్న సినిమా విశ్వంభర. ముందు ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు కానీ ఎప్పుడైతే విశ్వంభర నుంచి టీజర్ వచ్చిందో అప్పట్నుంచి సినిమాపై నెగిటివిటీ పెరిగిపోయింది. టీజర్ లోని వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని విశ్వంభరను దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
నెక్ట్స్ సమ్మర్ కు రిలీజ్
దీంతో మేకర్స్ వెంటనే ఆ బాధ్యతల్ని మరొక కొత్త కంపెనీకి అప్పగించి ఆ వీఎఫ్ఎక్స్ పనుల్ని పూర్తి చేయిస్తోంది. వీఎఫ్ఎక్స్ వల్ల విశ్వంభర రిలీజ్ మరింత ఆలస్యమవుతుందని, వచ్చే ఏడాది సమ్మర్ కు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నానని తన మాటగా హామీ ఇచ్చారు మెగాస్టార్. దీంతో విశ్వంభర రిలీజ్‌పై కాస్త నమ్మకం ఏర్పడింది.
ఇక అసలు విషయానికొస్తే యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే మొదలుపెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే విశ్వంభర నైజాం హక్కులను మైత్రీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ హక్కులను మైత్రీ సంస్థ ఎంత రేటుకు దక్కించుకుందనేది తెలియాల్సి ఉంది.
మెగా బ్లాస్ట్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్
తాజాగా చిరంజీవి బర్త్ డే సందర్భంగా విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్రిష, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వశిష్ట సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిరూ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
