ఈ సంక్రాంతి శంకర వరప్రసాద్‌ది మాత్రమే కాదు: చిరంజీవి
అయితే ఆ విజయాన్ని మీరు ఇస్తారనే నమ్మకం నాకు ఉంది. 2026 సంక్రాంతిని మర్చిపోకూడదు అనిపించేంత పెద్ద విజయాన్ని ప్రేక్షకులు ఇవ్వాలి.
By: Sivaji Kontham | 7 Jan 2026 11:17 PM ISTమెగాస్టార్ చిరంజీవి- వెంకీ రేర్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి రూపొందించిన `మన శంకరవరప్రసాద్ గారు` సంక్రాంతి బరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సాహు గారపాటి - సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథరిన్ కథానాయికలు. వెంకీ ఈ చిత్రంలో 45 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం.
నేటి సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ``ఈ సంక్రాంతికి కేవలం తన సినిమా మాత్రమే కాదు, అందరు హీరోల సినిమాలు హిట్టవ్వాలని ఆకాంక్షించారు. అందరికీ డార్లింగ్ ప్రభాస్ `రాజా సాబ్` కానీ, అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా బిఎండబ్ల్యూ (భర్త మహాశయులకు విజ్ఞప్తి) కానీ, నా ఇంట్లో పెరిగిన శర్వా `నారీ నారీ నడుమ మురారి`.. నన్ను గురువుగా భావించే నా శిష్యుడు నవీన్ పోలిశెట్టి నటించిన `అనగనగా ఒక రాజు` సినిమా.. ఇలా అందరి సినిమాలు సంక్రాంతి బరిలో పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.
అయితే ఆ విజయాన్ని మీరు ఇస్తారనే నమ్మకం నాకు ఉంది. 2026 సంక్రాంతిని మర్చిపోకూడదు అనిపించేంత పెద్ద విజయాన్ని ప్రేక్షకులు ఇవ్వాలి. అన్ని సినిమాలు సంక్రాంతికి బాగా ఆడతాయని అనుకుంటున్నాను.. అన్ని సినిమాలను థియేటర్లలోనే చూడండి`` అని అన్నారు. మొత్తానికి ప్రీరిలీజ్ వేడుకలో మెగా బాస్ తన సహచర హీరోలందరి సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షించడం మరోసారి పెద్దరికానికి సింబాలిక్ గా కనిపించింది.
నా సినిమా విషయానికి వస్తే, ప్రతిరోజూ ఒక పిక్నిక్ కి వెళ్లినట్టు సరదాగా పూర్తి చేసాం. అనీల్ రావిపూడి సెట్లో మా చేత నడిపించిన విధానం గొప్పది. లొకేషన్ లో అలాంటి వాతావరణం క్రియేట్ చేసిన గొప్పతనం అనీల్ రావిపూడికే చెందుతుంది. ఎక్కడా స్ట్రెస్ తెలియనివ్వడు. చకచకా చేయించేస్తాడు. అనీల్ రావిపూడి గురించి నేను చెప్పాల్సినది ఒకటి ఉంది.. ఈ సినిమా ఆల్రెడీ సూపర్‌హిట్.. ఏ రకంగా అంటే? బడ్జెట్ పరంగా ఇది పెద్ద హిట్టు. పరిమితులు దాటకుండా, తక్కువ రోజులలో సినిమా పూర్తి చేసాడు. ఒక డైరెక్టర్ బడ్జెట్ సహా అన్నిటిపైనా గ్రిప్పింగ్ గా ఉండాలి. అనుకున్న సమయానికి సినిమాని రెడీ చేసి అందించేవాడే అసలైన దర్శకుడు. ఆ రకంగా మొదటి విజయం సాధించేసామని చిరంజీవి అన్నారు.
మన శంకరవరప్రసాద్ గారు ఆడియో, టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ స్వాగ్, స్టైల్ అద్భుతంగా కుదిరాయి. మెగాస్టార్ స్టైల్, హాస్యచతురత 90ల నాటి స్టైల్ ఆకట్టుకోనున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో మెగా బాస్ అద్భుత నటనను ప్రదర్శించారని చిత్రబృందం చెబుతోంది.
