Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

టోలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటేనే రాయల్టీ, స్టైల్ అండ్ వింటేజ్ క్లాస్.. సినిమాల్లో తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి లగ్జరీ లైఫ్‌స్టైల్, ముఖ్యంగా ఖరీదైన లగ్జరీ వాచీలు అమితమైన ఇష్టం.

By:  Madhu Reddy   |   3 Nov 2026 4:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!
X

టోలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటేనే రాయల్టీ, స్టైల్ అండ్ వింటేజ్ క్లాస్.. సినిమాల్లో తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవికి లగ్జరీ లైఫ్‌స్టైల్, ముఖ్యంగా ఖరీదైన లగ్జరీ వాచీలు అమితమైన ఇష్టం. వివిధ సినీ ఈవెంట్లు, ప్రీ-రిలీజ్ వేడుకలలో ఆయన ధరించే ప్రత్యేకమైన లగ్జరీ వాచీలు, వాటి డిజైన్లు తరచుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. కోట్లు, లక్షల విలువ చేసే మెగాస్టార్ మోస్ట్ ఎక్స్‌క్లూజివ్ వాచ్ కలెక్షన్ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రూ. 2.29 కోట్ల ‘రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా’:

చిరంజీవి వాచ్ కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనది, ప్రత్యేకమైనది ‘రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా - ఐ ఆఫ్ ది టైగర్, వైట్ టైగర్’ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈవెంట్‌తో పాటు మరికొన్ని ప్రత్యేక వేడుకల్లో ఆయన ఈ వాచ్ ధరించి కనిపించారు. రీసెంట్ వర్షన్స్ మరియు డైమండ్స్ డీటైలింగ్‌తో ఉండే ఈ అల్ట్రా-లగ్జరీ వాచ్ ధర మార్కెట్‌లో దాదాపు రూ. 1.80 కోట్ల నుండి రూ. 2.29 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీనితో పాటు ఆయన వద్ద రూ. 1.25 కోట్ల విలువైన ప్లాటినంతో తయారు చేసిన ‘రోలెక్స్ డేటోనా ప్లాటోనా’ కూడా ఉంది.

జర్మన్ క్రాఫ్ట్స్‌మన్‌షిప్ ‘ఎ. లాంగే అండ్ సోహ్నే’:

లగ్జరీ అండ్ క్లాస్‌కి మారుపేరుగా నిలిచే జర్మన్ ప్రఖ్యాత బ్రాండ్ ‘ఎ. లాంగే అండ్ సోహ్నే’ వాచ్ కూడా చిరు కలెక్షన్‌లో ఉనికి చాటుతోంది. వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ ఈ రాయల్ టైమ్‌పీస్ ధరించి సందడి చేశారు. అద్భుతమైన జర్మన్ ఆర్కిటెక్చర్‌తో రూపొందే ఈ వాచ్ విలువ సుమారు రూ. 33 లక్షల నుండి రూ. 50.56 లక్షల పైనే ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

రాయల్ కార్టియర్ అండ్ ఫ్రాంక్ ముల్లర్ మోడల్స్:

క్లాసిక్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చే ‘కార్టియర్’ బ్రాండ్ వాచీలను సైతం చిరంజీవి అమితంగా ఇష్టపడతారు. ఆయన వద్ద రూ. 60 లక్షల విలువైన 'కార్టియర్ టోర్టో ఎక్స్ఎక్స్ఎల్ మల్టిపుల్ టైమ్ జోన్' మరియు రూ 4 లక్షల విలువ చేసే 'కార్టియర్ రోండే సోలో' మోడల్స్ ఉన్నాయి. అలాగే విలక్షణమైన 'టోన్యూ' షేప్ డిజైన్‌లకు పేరుగాంచిన స్విస్ బ్రాండ్ ‘ఫ్రాంక్ ముల్లర్’ టైమ్‌పీస్‌లను కూడా ఆయన సగర్వంగా ధరిస్తారు.

గిరార్డ్ పెరిగోక్స్ అండ్ యులిస్సే నార్డిన్:

ఇవే కాకుండా చిరు గ్యారేజ్‌లో రూ. 38 లక్షల విలువైన ‘గిరార్డ్-పెరిగోక్స్ లారేటో క్రోనోగ్రాఫ్’ మరియు సుమారు రూ. 7 లక్షల విలువ చేసే ‘యులిస్సే నార్డిన్ ఎగ్జిక్యూటివ్ డ్యూయల్ టైమ్’ వంటి ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్ వాచీలు ఉన్నాయి. దాదాపు రూ. 2.50 లక్షల విలువైన ‘బౌమ్ & మెర్సియర్ కేప్‌ల్యాండ్ ఎస్’ కూడా ఆయన కలెక్షన్ లో భాగమే.

ఇక మొత్తానికి చూస్తే, రోలెక్స్ నుండి కార్టియర్, లాంగే & సోహ్నే వరకు మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ ఆయన రాయల్టీని, రాయల్ టేస్ట్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ ప్రఖ్యాత టైమ్‌పీస్‌లు మెగాస్టార్ టైమ్‌లెస్ స్టైల్‌కి పర్‌ఫెక్ట్ నిదర్శనమని చెప్పవచ్చు.