Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో మొదలైన 'స్పిరిట్'.. ప్రభాస్ కనిపించలేదు కానీ..

మెగాస్టార్ చిరంజీవికి సందీప్ రెడ్డి వంగా డై హార్డ్ ఫ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే.

By:  M Prashanth   |   23 Nov 2025 3:07 PM IST
మెగాస్టార్ తో మొదలైన స్పిరిట్.. ప్రభాస్ కనిపించలేదు కానీ..
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'స్పిరిట్'సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సెన్సేషనల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్‌తో చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు హై లెవెల్ కు చేరుకున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.





మెగాస్టార్ చిరంజీవికి సందీప్ రెడ్డి వంగా డై హార్డ్ ఫ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే. ఇక 'స్పిరిట్' ఓపెనింగ్ సెరిమనీకి చిరంజీవి రావడంతో ఆ వేడుకకు మరింత కళ వచ్చింది. అయితే ప్రభాస్ లుక్ ని ఎక్కడ రివిల్ చేయకుండా చిరుతో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలు మాత్రమే వదిలారు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే, ఈ వేడుకలో నిర్మాత భూషణ్ కుమార్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరోయిన్ తృప్తి దిమ్రి తదితరులు పాల్గొన్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.





ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. "నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది" అంటూ ప్రభాస్ బర్త్‌డే నాడు రిలీజ్ చేసిన ఆడియో గ్లింప్స్ ఇప్పటికే సినిమా థీమ్‌పై ఒక క్లారిటీ ఇచ్చింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, ప్రభాస్ కటౌట్ కలిస్తే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే గూస్ బంప్స్ వస్తున్నాయి.





ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, కొరియన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'యానిమల్' సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి దిమ్రి ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇందులో విలన్‌గా కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రకాష్ రాజ్, కాంచన వంటి సీనియర్ నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. 2026లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం కూడా 'స్పిరిట్' పైనే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా వంగా తన స్టైల్ లో అనుకున్నట్లు చూపించగాలిగితే ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర మరో సునామీ క్రియేట్ చేయడం పక్కా అని తెలుస్తోంది.