అనిల్ కన్ఫర్మ్ చేసేశాడుగా!
అనిల్ రావిపూడి రైటింగ్ కు చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో దొరికితే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Aug 2025 6:41 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే విశ్వంభర సినిమాను పూర్తి చేసిన చిరూ, ఇప్పుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా157 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అనిల్, చిరంజీవి మొదటిసారి జట్టు కట్టగా, ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
అనిల్ రావిపూడి రైటింగ్ కు చిరంజీవి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరో దొరికితే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండటంతో పాటూ ఎప్పుడూ లేనిది ఆమెతో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయించడంతో మెగా157పై అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది.
అసలు పేరుతో..
మామూలుగానే సినిమాలను ఎంతో వేగంగా పూర్తి చేసే అనిల్ రావిపూడి, మెగా157ను ఇంకాస్త వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసిన అనిల్ ఈ మూవీ గురించి రీసెంట్ గా ఓ చిన్న అప్డేట్ ఇచ్చారు. మెగా157లో చిరంజీవి పేరు శంకర వరప్రసాద్ అని స్వయంగా వెల్లడించారు అనిల్. సినిమాల్లోకి రాకముందు చిరంజీవి అసలు పేరు కూడా అదే అవడం, ఆ పేరునే అనిల్ చిరూకి పెట్టి మంచి బజ్ క్రియేట్ చేశారు.
సక్సెస్ పై నిర్మాతల నమ్మకం
అనిల్ వెల్లడించిన ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవగా, ఈ సినిమా సక్సెస్ పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే మెగా157లో చిరూ పేరు గురించి గతంలోనే లీకులందగా, ఇప్పుడు స్వయంగా అనిలే ఆ పేరును రివీల్ చేయడంతో కన్ఫర్మ్ అయింది. 2026 సంక్రాంతికి కానుకగా ఈ సినిమా ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరూ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటూ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశాలున్నాయి.
