Begin typing your search above and press return to search.

మెగా 158 నుంచి బిగ్ అప్‌డేట్ వస్తుంది.. జస్ట్ వెయిట్!

చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ 158వ చిత్రానికి తాత్కాలికంగా `మెగా 158` అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు.

By:  Sivaji Kontham   |   14 Jun 2026 11:47 AM IST
మెగా 158 నుంచి బిగ్ అప్‌డేట్ వస్తుంది.. జస్ట్ వెయిట్!
X

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది నిజంగానే పూనకాలు తెప్పించే వార్త. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షెడ్యూళ్లను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మెగా బాస్ లుక్ ఎలా ఉండబోతోందో ఆయన ఇటీవలి పబ్లిక్ అప్పియరెన్సులను బట్టి క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. వింటేజ్ చిరంజీవిని తలపించేలా ఉన్న ఆయన మాస్ మేకోవర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ 158వ చిత్రానికి తాత్కాలికంగా `మెగా 158` అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే చిత్ర పరిశ్రమతో పాటు మెగా అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం రెట్టింపయింది. బాస్ సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి.. అలాంటిది ఈ ప్రాజెక్ట్ చుట్టూ వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సెంటిమెంట్ సీజన్ అయిన సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వేటకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల దుమ్ములేపిన `వాల్తేరు వీరయ్య` చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సూపర్ హిట్ జోడీ మళ్లీ కుదరడంతో ఈసారి థియేటర్లలో `వాల్తేరు వీరయ్య 2.O` రేంజ్‌లో డబుల్ ధమకా మాస్ ట్రీట్ ఖాయమని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ, తాజాగా పొల్లాచ్చిలో ప్లాన్ చేసిన కీలకమైన షెడ్యూల్‌ను చిత్రయూనిట్ అత్యంత వేగంగా పూర్తి చేసింది. ఇక్కడి షూటింగ్ అవుట్‌పుట్ విష‌యంలో దర్శకుడు బాబీతో పాటు మెగాస్టార్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు టాక్.

పొల్లాచ్చి షెడ్యూల్ వైబ్రేంట్ పేస్‌తో సక్సెస్‌ఫుల్‌గా పూర్త‌వ్వడంతో `మెగా 158` టీమ్ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు పూర్తి నమ్మకంతో అడుగులు వేస్తోంది. బాస్ కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్ లు కొట్టాయి. రికార్డులను తిరగరాశాయి.. అందుకే 2027 పొంగల్ రేసులో ఈ సినిమాను నిలబెట్టాలని మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో వర్క్ చేస్తున్నారని స‌మాచారం. 2017లో బాస్ రీఎంట్రీ ఇస్తూ న‌టించిన ఖైదీ నంబ‌ర్ 150 ఆ ఏడాది సంక్రాంతి బ‌రిలో బంప‌ర్ హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత 2023లో వాల్తేరు వీర‌య్య‌, 2026లో మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సంక్రాంతి బ‌రిలోనే వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. త‌దుప‌రి 2027 సంక్రాంతికి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ లోడింగ్ అని అర్థ‌మ‌వుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చాలా త్వరలోనే వెలువడనుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. జస్ట్ వెయిట్ ఫర్ దట్ బిగ్ అప్‌డేట్!

కేవీఎన్ రాజీ అన్న‌దే లేకుండా..

కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ `కేవీఎన్ ప్రొడక్షన్స్` ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి నేరుగా అడుగుపెడుతోంది. ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ క్రేజీ మాస్ ఎంటర్‌టైనర్‌కు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా... విజయ్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజువల్‌గా, మ్యూజికల్‌గా థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త హై ఇచ్చేందుకు ఈ టాప్ టెక్నీషియన్స్ టీమ్ సిద్ధమవుతోంది. సంక్రాంతి రేసులో మెగాస్టార్ తన మాస్ విశ్వరూపం చూపించడం గ్యారెంటీ అని ఈ అప్‌డేట్స్ చూస్తేనే అర్థమవుతోంది.