బ్లాక్‌బస్టర్ కలయిక మొదలయ్యేదప్పుడే!
ఏడు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెట్టి కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 19 Sept 2025 6:00 PM ISTఏడు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెట్టి కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేస్తున్న చిరంజీవి, ఆ సినిమా షూటింగ్ ను నవంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. అక్టోబర్ లో భారీ షెడ్యూల్ ఉండగా, ఆల్మోస్ట్ ఆ షెడ్యూల్ లోనే మేజర్ షూట్ ను పూర్తి చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట.
వరుస సినిమాలను లైన్ లో పెట్టిన చిరూ
మరో వైపు విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేశారు చిరూ. ప్రస్తుతం విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉండగా, ఈ రెండు కాకుండా మరో రెండు సినిమాలను కూడా చిరంజీవి లైన్ లో పెట్టారు. అందులో ఒకటి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కాగా, రెండోది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాతగా రాబోయే సినిమా.
బాబీతో మెగా158
బాబీ, శ్రీకాంత్ సినిమాల్లో ముందుగా బాబీతోనే చిరూ జట్టు కట్టనున్నారు. శ్రీకాంత్ సినిమా ముందు అనౌన్స్ అయినప్పటికీ అతను ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ లోపు చిరూ, బాబీ సినిమాను చేయాలని డిసైడ్ అందులో భాగంగానే చిరూ బర్త్ డే సందర్భంగా సినిమాను కూడా అనౌన్స్ చేశారు. మెగా 158 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.
ప్రీ ప్రొడక్షన్ లో మెగా158
బాబీ- చిరంజీవి కలయికలో గతంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో మెగా158పై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా బాబీ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం మెగా158కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, డిసెంబర్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట మేకర్స్. ఈలోపు చిరూ కూడా అనిల్ రావిపూడి సినిమా నుంచి ఫ్రీ అవుతారు కాబట్టి బాబీ సినిమాకు డేట్స్ ను అడ్జస్ట్ చేయొచ్చు. కె.వి.ఎన్ ప్రొడక్షన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
