Begin typing your search above and press return to search.

చిరు, పవన్, చరణ్.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు..

ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు.

By:  M Prashanth   |   21 May 2026 12:47 AM IST
చిరు, పవన్, చరణ్.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు..
X

టాలీవుడ్ లో మెగా హడావుడి మరోసారి హైలెట్ కానుంది. బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కలయికలో వస్తున్న కొత్త సినిమా లాంచ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఒకే వేదికపై ఈ ముగ్గురు టాప్ హీరోలు కనిపించనుండటం మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

చాలా కాలం తర్వాత ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఈ లాంచ్ ఈవెంట్ కోసం సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ చిరంజీవిని తెరపై చూపించి సక్సెస్ కొట్టాడు బాబీ. ఇప్పుడు అదే రేంజ్ లో మెగా 158 ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది.

పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను మేకర్స్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాత వెంకట్ కె నారాయణ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నిర్మాణ విలువల విషయంలో బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బాబీ మాస్ స్టోరీ టెల్లింగ్ కు నిర్మాతల సపోర్ట్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ సరికొత్తగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి చేస్తున్న మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇటీవల జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. క్యారెక్టర్ కోసం చిరు పడుతున్న కష్టం చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. కథ డిమాండ్ మేరకు ఒక పవర్ ఫుల్, షార్ప్ లుక్ లో మెగాస్టార్ ను ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఈ వయసులో కూడా ఫిట్నెస్ పై చిరు చూపిస్తున్న డెడికేషన్ కి మంచి అప్లాజ్ వస్తోంది.

ఈ గ్రాండ్ లాంచ్ తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లపై ముందుగా ఫోకస్ పెట్టి, ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ ఓపెనింగ్ ఈవెంట్ ఫొటోలు నెట్టింట ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.