బాబీ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. అందుకే హైడ్ చేస్తున్నారా?
బిహైండ్ ది సీన్స్ ఫొటోల్లో చిరంజీవి లుక్‌ను మామూలుగా చూపించేయడం డైరెక్టర్ బాబీకి అస్సలు ఇష్టం లేదట.
By: Madhu Reddy | 22 Jun 2026 1:02 PM ISTమెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మెగా 158’పై అంచనాలు మామూలుగా లేవు, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని, రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుండి తాజాగా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే, అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ మాత్రం ఆ ఫొటోల్లో ఎక్కడా కనిపించలేదు. దీని వెనుక డైరెక్టర్ బాబీ వేసిన ఒక అదిరిపోయే మాస్టర్ ప్లాన్ ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ముచ్చటించుకుంటున్నారు. ఆ విశేషాలు ఇలా వున్నాయి..
సెట్స్‌కి వచ్చిన రామ్ చరణ్.. కానీ?:
ఫాదర్స్ డే సందర్భంగా డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవిని కలవడానికి షూటింగ్ సెట్స్‌కి రావడంతో, అక్కడ దిగిన కొన్ని ఫొటోలు ఇవి. ఇక ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కానీ, అందులో చిరంజీవి మాత్రం ఒక్క ఫ్రేమ్‌లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
లుక్ లీక్ అవ్వకుండా బాబీ జాగ్రత్తలు:
చిరంజీవి ఫొటోల్లో కనిపించకపోవడానికి అసలు కారణం చిత్ర యూనిట్ కావాలనే ఆయన లుక్‌ను దాచిపెడుతుండటమే, ఈ సినిమా కోసం మెగాస్టార్ లుక్ విషయంలో మేకర్స్ చాలా రకాల టెస్టులు చేసి, ఒక స్పెషల్ డిజైన్‌ను లాక్ చేశారట. ఆ లుక్ ఇప్పుడే బయటకు వస్తే కిక్ పోతుందని, ఎంతో సీక్రెట్‌గా ఉంచుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మూవీపై హైప్ పెంచేందుకే ఈ ప్లాన్:
బిహైండ్ ది సీన్స్ ఫొటోల్లో చిరంజీవి లుక్‌ను మామూలుగా చూపించేయడం డైరెక్టర్ బాబీకి అస్సలు ఇష్టం లేదట. ఒకేసారి అదిరిపోయే ప్రమోషనల్ క్యాంపెయిన్ ద్వారా అఫీషియల్‌గా మెగాస్టార్ కొత్త లుక్‌ను రివీల్ చేస్తే, సినిమాపై అంచనాలు మరియు హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తాయని టీమ్ నమ్ముతోంది. అందుకే ఈ రేంజ్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
భారీ కాస్టింగ్.. అదిరిపోయే మ్యూజిక్:
KVN ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లో మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి ప్రియమణి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.
ఇక అభిమానుల్లో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మెగాస్టార్ సరికొత్త లుక్‌ను దాచిపెట్టి సరైన సమయంలో సర్ప్రైజ్ ఇవ్వాలనుకోవడం బాబీ వేసిన సూపర్ ప్లాన్ అని చెప్పొచ్చు. మరి ఈ మాస్టర్ ప్లాన్‌తో మెగాస్టార్ లుక్‌ను ఎప్పుడు రివీల్ చేస్తారో, అది ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.
