Begin typing your search above and press return to search.

మెగా158లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్? బాబీ పోస్టుతో మొదలైన డిస్క‌ష‌న్స్

బాబీ మూవీస్ లో యాక్షన్‌కు స్పెష‌ల్ ప్లేస్ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్‌ను భారీ స్థాయిలో డిజైన్ చేయడంలో ఆయనకు మంచి పేరుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 Jun 2026 9:00 PM IST
మెగా158లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్? బాబీ పోస్టుతో మొదలైన డిస్క‌ష‌న్స్
X

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా158 సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య లాంటి భారీ స‌క్సెస్ త‌ర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, డైరెక్ట‌ర్ బాబీ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సినిమాపై చర్చను మరింత హీట్ ఎక్కించింది.

తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ మెషిన్ గన్ ఫొటోను షేర్ చేసిన బాబీ.. ఈ బుల్లెట్స్ బిగ్ స్క్రీన్‌కు వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయండంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. ఒక్క ఫొటో, ఒక్క లైన్‌తోనే సినిమా గురించి కొత్త చర్చకు తెరలేపిన బాబీ, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశారు. ఈ పోస్టు చూసిన వెంటనే సోషల్ మీడియాలో మెగా158లో నెక్స్ట్ లెవెల్ గన్ ఫైట్ ఉండబోతోందా?, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారా? అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

బాబీ మూవీస్ లో యాక్షన్‌కు స్పెష‌ల్ ప్లేస్ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్‌ను భారీ స్థాయిలో డిజైన్ చేయడంలో ఆయనకు మంచి పేరుంది. ఈసారి చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్ విజువల్స్‌తో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బాబీ చేసిన‌ మెషిన్ గన్ పోస్టు కూడా అదే దిశగా అభిమానుల్లో ఊహాగానాలకు కారణమైంది.

ఇక ప్రమోషన్స్ పరంగా చూస్తే, బాబీ ఎంచుకున్న ఈ స్ట్రాటజీ కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది. ఎలాంటి పోస్టర్, గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ చేయకుండానే కేవలం ఒక సోష‌ల్ మీడియా పోస్టుతో సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేయడం మార్కెటింగ్ పరంగా తెలివైన అడుగుగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇలాంటి చిన్న చిన్న హింట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో షెడ్యూల్‌లో కీలక యాక్షన్ సీన్స్ ను తెర‌కెక్కిస్తున్న‌ట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక మరికొన్ని భారీ ఎపిసోడ్లను తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా చిరంజీవిని మరోసారి వింటేజ్ మాస్ అవతార్‌లో చూపించేందుకు బాబీ స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి 2027ను టార్గెట్‌గా పెట్టుకున్న ఈ సినిమాకు షూటింగ్ కూడా అదే వేగంతో కొనసాగుతోంది. ఇప్పటికే అభిమానుల్లో మంచి బజ్ ఉన్న మెగా158కు, బాబీ చేసిన తాజా పోస్టు మరింత హైప్‌ను తీసుకొచ్చింది.