Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీలో 'డబుల్' గుడ్ న్యూస్

ఈ "డబుల్" అనే పదం, వీడియోలోని కొన్ని దృశ్యాలు చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రాబోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

By:  M Prashanth   |   23 Oct 2025 12:32 PM IST
మెగా ఫ్యామిలీలో డబుల్ గుడ్ న్యూస్
X

పండగంటేనే సంబరాలు, సంతోషాలు. అందులోనూ మెగా ఫ్యామిలీలో పండగ వేడుకలు ఎప్పుడూ ఒక రేంజ్‌లో ఉంటాయి. ఈ దీపావళి కూడా వారి ఇంట్లో ఘనంగా జరిగింది. అయితే, ఈసారి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో, ఒక క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల షేర్ చేసిన ఒక పోస్ట్, ఫ్యాన్స్‌లో కొత్త ఊహాగానాలను రేకెత్తిస్తోంది.

ఉపాసన తన సోషల్ మీడియాలో దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక అందమైన వీడియోను పంచుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ సభ్యులు, బంధువులు అందరూ పండగ వాతావరణంలో ఎంతో ఆనందంగా కనిపించారు. చిరంజీవి, సురేఖ, చరణ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వీడియోలో ఉపాసనకు పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తున్నట్లు, బహుమతులు ఇస్తున్నట్లు కనిపించింది.

అంతా బాగానే ఉంది కానీ, దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షనే ఇప్పుడు అసలు చర్చకు దారితీసింది. "ఈ దీపావళి.. డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్‌తో నిండిపోయింది" అని ఉపాసన పోస్ట్ చేశారు. ఈ "డబుల్" అనే పదం, వీడియోలోని కొన్ని దృశ్యాలు చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రాబోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు/వారసురాలు రాబోతున్నారా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇప్పటికే 'క్లీంకార కొణిదెల' అనే ముద్దుల కుమార్తె ఉంది. ఇప్పుడు ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని, అందుకే ఈ "డబుల్ సెలబ్రేషన్" అని ఆమె హింట్ ఇచ్చారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. వీడియోలో పెద్దలు ఆమెకు ప్రత్యేకంగా ఆశీస్సులు ఇవ్వడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో విషెస్ తో ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. "కంగ్రాచ్యులేషన్స్ అన్నా వదిన", "గుడ్ న్యూస్ చెప్పినందుకు థాంక్స్" అంటూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఇది పక్కా గుడ్ న్యూస్ అని ఫిక్స్ అయిపోయి, మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.