Begin typing your search above and press return to search.

మెగా హీరోలు.. ఎవరు ఫస్ట్ ముగింపు పలుకుతారో?

ఇప్పుడు అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్న ఆయన.. విశ్వంభరను కంప్లీట్ చేశారు. ఆ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

By:  M Prashanth   |   20 Aug 2025 11:27 AM IST
మెగా హీరోలు.. ఎవరు ఫస్ట్ ముగింపు పలుకుతారో?
X

టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అనేక మంది హీరోలు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ వరకు.. పలువురు ఇండస్ట్రీలో ఉన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా తెరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది.

అయితే కొంతకాలంగా మెగా హీరోల్లో అల్లు అర్జున్ తప్ప మిగతా వారంతా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పలు సినిమాలతో థియేటర్స్ లోకి వచ్చినా.. అనుకున్నట్లు రిజల్ట్ సాధించలేకపోయారు. దాదాపు వారంతా రెండేళ్లుగా ఒక్క హిట్ కూడా సాధించలేదు. ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు వారంతా ఎలాంటి విజయం అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ నిరీక్షణకు ఏ మెగా హీరో ఫస్ట్ ముగింపు పలుకుతారోనని మాట్లాడుకుంటున్నారు. అయితే వాల్తేరు వీరయ్యతో చివరగా హిట్ అందుకున్న చిరు.. ఆ తర్వాత భోళా శంకర్ తో వచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఇప్పుడు అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్న ఆయన.. విశ్వంభరను కంప్లీట్ చేశారు. ఆ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. చిన్న గ్యాప్ తర్వాత రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమాకు ఆడియన్స్ ను మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఇప్పడు తన అప్ కమింగ్ మూవీ ఓజీపై హోప్స్ పెట్టుకున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్.. ఆ తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల్లో కనిపించారు. కానీ ఫ్లాప్స్ ను చవిచూశారు. ఇప్పుడు పెద్ది చేస్తున్న ఆయన, భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు, వరుణ్ తేజ్.. చాలా కాలంగా సోలో లీడ్‌ గా మంచి హిట్ సాధించడానికి ట్రై చేస్తున్నారు. చివరిగా 2019లో గద్దలకొండ గణేష్ తో మెప్పించారు. ఇప్పుడు మేర్లపాక గాంధీతో కొరియా- ఇండో జోనర్ లో యాక్షన్ కామెడీ సినిమా చేస్తూ.. దానిపై హోప్స్ పెట్టుకున్నారు.

అదే సమయంలో మెగా మేనలుళ్లు సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ పరిస్థితి కూడా అదే. విరూపాక్ష మూవీ తర్వాత ఇప్పటివరకు ఆ రేంజ్ లో సాయి దుర్గ తేజ్ ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఇప్పుడు 2025 చివర్లలో సంబరాల ఏటి గట్టు (SYG)తో రానున్నారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ డెబ్యూతో రూ.100 కోట్ల హిట్ అందుకున్నారు.

కానీ ఆ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆది కేశవ చిత్రాలతో వరుస పరాజయాలను చవిచూశారు. గత రెండేళ్లుగా వైష్ణవ్ కొత్త సినిమాను ప్రకటించలేదు. స్క్రిప్ట్ ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. దీంతో మెగా అభిమానులంతా తమ అభిమాన హీరోలు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.