Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్.. ఏడాదంతా నాన్ స్టాప్ మజా!

పెద్ది తర్వాత కొన్ని రోజులకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   20 Jan 2026 8:41 AM IST
మెగా ఫ్యాన్స్.. ఏడాదంతా నాన్ స్టాప్ మజా!
X

మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. అందుకు కారణం.. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోవడమే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సంక్రాంతికి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తోంది. అంతే కాదు.. చిరంజీవికి కమ్ బ్యాక్ మూవీగా నిలిచి సందడి చేస్తోంది.

దీంతో అభిమానులంతా ఖుషీగా ఉన్నారు. అయితే ఈ ఏడాదంతా వారికి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మజా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2026లో మెగా ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో సందడి చేయనున్నారు. ఆయా చిత్రాలపై ఆడియన్స్ లో సూపర్ హైప్ కూడా ఉంది. అవన్నీ సూపర్ హిట్స్ గా నిలుస్తాయని అంతా అంచనా వేస్తున్నారు.

2026 జనవరిలో చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సందడి చేయగా.. ఆ తర్వాత ఆయన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ థియేటర్స్ లోకి పెద్ది సినిమాతో రానున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా.. ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ తో సూపర్ హైప్ క్రియేట్ అయింది.

పెద్ది తర్వాత కొన్ని రోజులకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే హరీష్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో సేమ్ సీన్ రిపీట్ అవ్వనుందని అంచనాలు వెలువడుతున్నాయి.

ఇక వేసవిలో విశ్వంభరతో థియేటర్స్ లోకి రానున్నారు చిరంజీవి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం మేకర్స్ తుది మెరుగులు దిద్దుతున్నారు. నిజానికి సినిమాపై ముందు పాజిటివ్ బజ్ ఉండగా.. ప్రమోషనల్ కంటెంట్ మాత్రం దాన్ని వీక్ చేసేసింది. దీంతో కచ్చితంగా ఆడియన్స్ ను తమ వైపు తిప్పుకునేలా.. మళ్లీ బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో చిరు, పవన్, చరణ్ తోపాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తమ అప్ కమింగ్ మూవీస్ తో సందడి చేయనున్నారు. సంబరాల యేటి గట్టు, కొరియన్ కనకరాజు సినిమాలతో వారిద్దరూ రానుండగా.. ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ ఏడాదంతా మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందనే చెప్పాలి. అదే సమయంలో చిరు, పవన్ తప్ప చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కూడా కనిపిస్తున్నారు. అదే జరిగితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.