Begin typing your search above and press return to search.

గమనించే లోగా.. గమనించే రాగాన.. కవిత్వం వల్లిస్తున్న మెగా డాటర్..

మెగా డాటర్ నిహారిక.. ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావాలని ఎన్నో కలలు కంది.

By:  Madhu Reddy   |   15 Jan 2026 10:18 PM IST
గమనించే లోగా.. గమనించే రాగాన.. కవిత్వం వల్లిస్తున్న మెగా డాటర్..
X

మెగా డాటర్ నిహారిక.. ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావాలని ఎన్నో కలలు కంది. అందులో భాగంగానే తన కలను సాకారం చేసుకోవడానికి ఒక మనసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నప్పటికీ ఈ సినిమా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇటీవల నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రం తీసి నిర్మాతగా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం మరోవైపు సంగీత్ శోభన్ తో కలిసి మరో చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.




అలా ఒకవైపు నిర్మాతగా మంచి కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న ఈమె.. ఇంకొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా మారి అభిమానులను అలరిస్తోంది. సాధారణంగా సమయం దొరికిందంటే చాలు ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయే ఈమె.. పండుగలు వచ్చాయంటే చాలు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. ముఖ్యంగా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని అభిమానులతో ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి ఈ సంక్రాంతి పండుగకు మరింత సాంప్రదాయంగా ముస్తాబయి ఏకంగా కవిత్వాలు వల్లిస్తూ ఫోటోలు షేర్ చేసింది నిహారిక.




రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో లెహంగా ధరించిన ఈమె.. జుట్టును ఫ్రీగా వదిలేసి మెడను చౌకర్తో అలంకరించింది. అలాగే చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకొని మరింత అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ లెహంగాలో తన అందంతో అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేసింది నిహారిక. ఇకపోతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూనే కింద క్యాప్షన్ లో.."గమనించే లోగా.. గమనించే రాగాన... ఏదో వీణ లోన మోగేనా" అంటూ తన మనసులోని మాటలను కవిత్వం రూపంలో షేర్ చేసింది. ఇక ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిహారిక విషయానికి వస్తే ఒకవైపు నిర్మాతగా చిత్రాలను నిర్మిస్తూనే.. మరొకవైపు గత ఏడాది మద్రాస్ కారన్ అనే చిత్రంతో హీరోయిన్గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమాలో నిహారిక ఎప్పుడూ నటించని విధంగా నటించింది. కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన హీరోగా మరో సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. ఇక అలాగే నిహారిక మంచు మనోజ్ హీరో గా నటిస్తున్న వాట్ ద ఫిష్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇకపోతే హీరోయిన్ గా మళ్లీ అవకాశాలు అందుకుని ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన డ్రీమ్ ను నెరవేర్చుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.