Begin typing your search above and press return to search.

అరుణాచల్ కొండల్లో నిహారిక సాహసం.. మ్యాగీ లేని జీవితం వ్యర్థం!

మెగా డాటర్ నిహారిక ఓవైపు నటిగా అదరగొడుతూనే.. మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తోంది.

By:  Madhu Reddy   |   11 Aug 2025 4:56 PM IST
అరుణాచల్ కొండల్లో నిహారిక సాహసం.. మ్యాగీ లేని జీవితం వ్యర్థం!
X

మెగా డాటర్ నిహారిక ఓవైపు నటిగా అదరగొడుతూనే.. మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో సైక్లింగ్ కి వెళ్ళిన దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మరి అరుణాచల్ ప్రదేశ్ లో సైక్లింగ్ చేస్తున్న నిహారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ ఇంట్రెస్టింగ్ పోస్టులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


చాలామంది హీరోయిన్లు సాహస యాత్రలు, విహారయాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏ మాత్రం సమయం దొరికినా కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకి వెళ్తూ అక్కడి అందమైన ప్రదేశాలకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే విహారయాత్రలు చేయడం సులువే.. కానీ సాహస యాత్రలు చేయడం మాత్రం చాలా కష్టం. కానీ ఆ కష్టమైన ప్రాంతాల్లో కూడా ఈ నటీమణులు చాలా ఇష్టంగా సాహస యాత్రలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇలాంటి పనే చేసింది మెగా డాటర్ నిహారిక.. తాజాగా నిహారిక అరుణాచల్ ప్రదేశ్ లో సైక్లింగ్ ట్రిప్ కి సంబంధించి కొన్ని అద్భుతమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే నిహారిక షేర్ చేసిన ఫోటోలలో క్లైమేట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.


వర్షాలు పడడంతో క్లైమేట్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రెయినీ సీజన్ లో సైక్లింగ్ చేయడం అనేది చాలా స్పెషల్ అని, ఆమె సరైన సమయాన్ని ఎంచుకుంది అంటూ చాలామంది ఈ ఫోటోలు చూసిన జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక ఉన్న ప్లేస్ లో వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో ఆమె పెట్టిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ట్రిప్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అరుణాచల్ ప్రదేశ్ లోని రోడ్లు మొత్తం వంకర్లు తిరిగి కొండల మధ్య ఉంటాయి. అలాగే పచ్చని లోయలు వంటివి ఎన్నో మార్గమధ్యంలో కనిపిస్తాయి. ఇక ఇలాంటి పచ్చని లోయల్లో సైక్లింగ్ చేస్తే మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఇలాంటి ప్రదేశాల్లో సాహస యాత్రలు చేయడం కూడా శారీరక సవాల్ తో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు.


ఇక అక్కడ సైక్లింగ్ చేస్తున్న నిహారిక ఆ పచ్చని కొండల మధ్య ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని షేర్ చేసింది. అందులో ఆమె కాఫీ తాగుతున్న ఫోటోని అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా మ్యాగీని తింటున్న ఫోటోను కూడా షేర్ చేసింది. మ్యాగీ లేని జీవితాన్ని ఊహించుకోగలమా అంటూ కూడా పోస్ట్ పెట్టింది..అలా ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు మైండ్ రిఫ్రెష్ కోసం వెకేషన్స్ కి వెళ్తున్న నిహారిక ప్రస్తుతం క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక నిహారిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ తో కలిసి వాట్ ది ఫిష్ అనే మూవీలో నటిస్తోంది. అలాగే కమిటీ కుర్రాళ్ళు మూవీ తర్వాత సంగీత్ శోభన్- నయన్ సారికలతో కలిసి ఈ మధ్యనే ఒక కొత్త సినిమాని కూడా ప్రారంభించింది.