Begin typing your search above and press return to search.

వైరల్: జిమ్‌లో మెగా హీరోల రేర్‌ మూమెంట్‌

సెట్‌ లో బిజీగా గడిపే సినీ నటులు, ఒకరినొకరు కలుసుకోవడం చాలా అరుదు. ఒకవేళ కలుసుకున్నా కూడా ప్రైవేట్ గానే ఉంటారు.

By:  M Prashanth   |   10 Aug 2025 5:30 PM IST
వైరల్: జిమ్‌లో మెగా హీరోల రేర్‌ మూమెంట్‌
X

సెట్‌ లో బిజీగా గడిపే సినీ నటులు, ఒకరినొకరు కలుసుకోవడం చాలా అరుదు. ఒకవేళ కలుసుకున్నా కూడా ప్రైవేట్ గానే ఉంటారు. ఇక అప్పుడప్పుడు వాళ్ళు కలిసినప్పుడు షేర్ చేసుకునే మూమెంట్స్ ఫ్యాన్స్ కి కూడా కిక్కిస్తాయి. అయితే మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో వర్కౌట్‌ చేస్తూ కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది.

ఆ ఫోటోలో ఉన్న ఫ్రెండ్లీ వైబ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. ముగ్గురూ ప్రస్తుతం తమ తమ భారీ యాక్షన్‌ సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. పెద్ది, సంబరాల యేటి గట్టు, హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందుతున్న VT15 ఇవి ముగ్గురి ప్రాజెక్టులు. ప్రతి చిత్రానికీ ఫిజిక్‌ మెయింటైన్‌ చేయడం కోసం కఠినమైన వర్కౌట్‌ చేస్తున్నారు.

అదే క్రమంలో జిమ్‌లో కలిసి చెమటోడ్చిన ఈ క్షణాన్ని ఫొటోగా మార్చి అభిమానులతో పంచుకున్నారు. ఫోటోలో వరుణ్‌ తేజ్‌ మొబైల్‌తో క్లిక్‌ చేస్తుండగా, రామ్‌ చరణ్‌ తన బీస్ట్‌ లుక్‌లో పోజ్‌ ఇస్తూ, సాయి తేజ్‌ తన స్టైల్లో నిలబడ్డాడు. వీరంతా కేవలం బాడీ బిల్డింగ్‌కే కాకుండా, సోదరభావాన్ని కూడా మెయింటైన్‌ చేస్తున్నారని ఈ పిక్‌ చెబుతోంది. వీరి ట్రైనర్‌ రాకేష్‌ ఉదయర్‌ కూడా వెనక నుంచి ఆనందంగా చూస్తూ కనిపించడం ప్రత్యేకత.

రామ్‌ చరణ్‌ పెద్ది సినిమా కోసం బలమైన లుక్‌ను మెయింటైన్‌ చేస్తుండగా, సాయి తేజ్‌ తన SYG కోసం కష్టపడుతున్నారు. ఇక వరుణ్‌ తేజ్‌ అయితే హారర్‌ కామెడీ కోసం అవసరమైన కొత్త లుక్‌పై దృష్టి పెట్టాడు. ఈ అరుదైన మూమెంట్ చూసిన అభిమానులు సోషల్‌ మీడియాలో మెగా కజిన్స్‌ బాండింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా కలసి వర్కౌట్‌ చేసే సమయం కేటాయించడం గొప్ప విషయం అని కామెంట్ చేస్తున్నారు.