చరణ్ ఆస్తి 1370 కోట్లు- ఉపాసన ఆస్తి 1130 కోట్లు!
అయితే ఇలాంటి ఆనందకర సమయంలో ఈ ఆదర్శ జంట నికర ఆస్తుల గురించి ఫిలింసర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 22 Nov 2025 10:00 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు అభిమానులకు ఇటీవలే 'డబుల్ ధమాకా ఫెస్టివల్' గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దంపతుల మొదటి సంతానం అయిన క్లిన్ కారా బుడి బుడి అడుగులతో వేగంగా ఎదిగేస్తోంది. మెగా - కామినేని కుటుంబాల్లో చిన్నారి క్లిన్ కారా గొప్ప కాంతులను తెచ్చింది. త్వరలోనే ఈ దంపతులు కవలలకు జన్మనివ్వబోతున్న వార్త ఇరు కుటుంబాలలో మరింతగా ఆనందాన్నిచ్చింది.
అయితే ఇలాంటి ఆనందకర సమయంలో ఈ ఆదర్శ జంట నికర ఆస్తుల గురించి ఫిలింసర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రామ్ చరణ్ ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోగా తారాపథాన్ని ఏల్తున్నాడు. అతడు ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్లో తన స్థాయిని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఒక్కో సినిమాకి సుమారుగా 75 కోట్లు పైగా ఆర్జిస్తున్నాడు. రెండు దశాబ్ధాల కెరీర్ లో చరణ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అయితే అతడు సినిమాలు, ప్రకటనల ఆదాయంతో పాటు వారసత్వంగా వచ్చిన సంపదలు కలుపుకుని దాదాపు 1370 కోట్ల నికర ఆస్తులను కలిగి ఉన్నాడని కథనాలొచ్చాయి.
అలాగే ఉపాసన అపోలో గ్రూప్స్ సంస్థానంలో మేనేజ్ మెంట్ లో కీలక పాత్రల్ని అజేయంగా పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన పదవులు, ఉద్యోగం నుంచి వచ్చే సంపాదనతో పాటు, వారసత్వ సంపదగా వచ్చే ఆస్తులను కలుపుకుని ఉపాసన వ్యక్తిగత నికర ఆస్తుల విలువ రూ.1,130 కోట్లు. ఇది సుమారు 135 మిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా. ఉపాసన వ్యాపార సంస్థలు.. తన ఉద్యోగం, కుటుంబ ఆస్తుల నుండి చాలా ఆస్తులను కలిగి ఉన్నారు. తన భర్త రామ్ చరణ్‌కు ఉన్న ఆస్తులు రూ. 1370 కోట్లు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల నికర ఆస్తితో భారతదేశంలో అసాధారణ నికర ఆస్తి విలువ ఉన్న జంటగా రికార్డులకెక్కారు. చరణ్- ఉపాసన దంపతుల నికర ఆస్తిని అమెరికన్ డాలర్లలో కొలిస్తే 300 మలియన్ డాలర్లకు సమానం. దాదాపు లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఆరోగ్య సంరక్షణ రంగంలో దిగ్గజ గ్రూప్ గా పాపులరైన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు బిలియనీర్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి ఉపాసన మనవరాలు అన్న సంగతి తెలిసిందే. లండన్ లో ఉపాసన ఎంబీఏ విద్యను అభ్యసించారు.
మెగా కోడలు ఉపాసన అపారమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చాలా కాలంగా మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన గురించి ఉపాసన బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఉపాసన స్పీచ్ చాలా పెద్ద చర్చకు తెర తీసింది. మహిళలు తమ అండాలను ఫ్రీజ్ చేసి దాచుకోవడం అతిపెద్ద భీమా! అని ఉపాసన ప్రకటించారు. తమకు నచ్చిన కెరీర్ ని ఎంచుకుని, నచ్చినప్పుడు పెళ్లాడి పిల్లల్ని కనొచ్చని సూచించారు. అయితే దీనిపై చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
