మెగా ఫెస్ట్ ఎప్పుడో.. బర్త్‌డేకి క్లారిటీ వచ్చేనా?
ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయమై స్పష్టత కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి
By: Ramesh Palla | 4 July 2026 3:28 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో వచ్చి సూపర్ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇదే ఏడాది చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వంభర' సైతం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' పై అంచనాలు భారీగా పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు. బింబిసార దర్శకుడు రూపొందించిన విశ్వంభర సినిమా గురించి ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అయితే మధ్యలో సినిమా వాయిదాల పర్వంలో పడటం, వీఎఫ్‌ఎక్స్ విషయంలో ట్రోల్స్ రావడంతో విశ్వంభర క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అయితే సినిమా విడుదల సమయంకు కచ్చితంగా చిరంజీవి మేజిక్ తో మంచి హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.
చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్...
రెగ్యులర్ ఆడియన్స్ విషయం పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ 'విశ్వంభర' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత చేసిన సోషియో ఫాంటసీ మూవీ ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సరికొత్త లోకాలను చూపిస్తాను అంటూ దర్శకుడు గతంలో చేసిన వ్యాఖ్యలు సైతం అంచనాలు పెంచాయి. హీరోయిన్‌గా త్రిష నటించిన విషయం తెల్సిందే. మొన్నటి వరకు దసరా కానుకగా విశ్వంభర వస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాలేదంటూ మళ్లీ అదే పాట పాడుతున్నారు. విశ్వంభర కొత్త విడుదల తేదీ విషయమై స్పష్టత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి, బాబీ కాంబోలో ప్రారంభం అయిన సినిమా విడుదల విషయమై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి రెండో సినిమా...
ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయమై స్పష్టత కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సినిమా విడుదల అంటే మెగా ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పండుగ ఎప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా చిరంజీవి వైపు చూస్తున్నారు. వచ్చే నెలలో చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలపై స్పష్టత వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాబీ కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం కావడం, చకచక పనులు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కనుక సర్‌ప్రైజింగ్ పోస్టర్ లేదా టీజర్‌ను బాబీ ప్లాన్ చేస్తున్నాడు. అంతే కాకుండా షూటింగ్ అప్డేట్ ఇచ్చి విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
విశ్వంభరలో చిరుకు జోడీగా త్రిష...
చిరంజీవి-బాబీ కాంబోలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీకి మంచి స్పందన వచ్చింది. కనుక మళ్లీ హిట్ బొమ్మ ఖాయం అని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే వీరి కాంబో మూవీ సైతం త్వరగా రావాలని కోరుకుంటున్నారు. విశ్వంభర సినిమా విడుదల ఈ ఏడాదిలోనే ఉంటే, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిరంజీవి మూవీ వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ విశ్వంభర సినిమా ఈ ఏడాది కూడా రాలేక పోతే, అప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ముందు వచ్చే అవకాశం ఉంది. ఈసారి కనుక విశ్వంభర వాయిదా పడితే మెగా ఫ్యాన్స్ సైతం సినిమా గురించి మర్చి పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా విశ్వంభర, బాబీ మూవీ రెండూ తక్కువ గ్యాప్‌లో రావాలని, మెగా పండుగ జరుపుకోవాల్సిందే అని అంటున్నారు. మరి చిరంజీవి బర్త్‌డేకి మెగా ఫెస్ట్ డేట్స్ అనౌన్స్ అయ్యేనా చూడాలి.
