'అన్నయ్య' యాక్టింగ్ కు 'తమ్ముడు' ఫిదా అయ్యాడా?
పొల్లాచి షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్ ను కూడా తాజాగా విడుదల చేసిన వీడియోలో చూపించారు.
By: M Prashanth | 22 Jun 2026 7:23 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారుతోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఆ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో, షూటింగ్ అప్డేట్లు చూస్తుంటే ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి యాక్టింగ్ పై దర్శకుడు బాబీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల మెగా 158 రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి నటనకు దర్శకుడు బాబీ ఫిదా అయినట్లు కనిపించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో "జీవించేశారు అన్నయ్య" అంటూ చిరంజీవి పెర్ఫార్మెన్స్ ను ప్రశంసించారు. దీంతో మెగాస్టార్ రోల్ సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
అంతకుముందు తమిళనాడులోని పొల్లాచిలో తొలి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. అక్కడ మెయిన్ క్యాస్టింగ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. పొల్లాచి షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్ ను కూడా తాజాగా విడుదల చేసిన వీడియోలో చూపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కొన్ని ఎమోషనల్, యాక్షన్ సీన్స్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఫాదర్స్ డే సందర్భంగా జరిగిన మరో ఇన్సిడెంట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా 158 షూటింగ్ సెట్స్ కు చేరుకుని చిరంజీవిని సర్ప్రైజ్ చేశారు. అయితే ప్రస్తుతం చర్చ అంతా చరణ్ సర్ప్రైజ్ విజిట్ గురించే కాదు. మేకింగ్ వీడియోలో కనిపించిన చిరంజీవి నటన గురించే. బాబీ లాంటి మాస్ దర్శకుడు షూటింగ్ మధ్యలోనే "జీవించేశారు అన్నయ్య" అని చెప్పడం చూస్తే, సినిమాలో చిరంజీవి పాత్ర ఆకట్టుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరు యాక్టింగ్ కు బాబీ తమ్ముడు నిజంగానే ఫిదా అయ్యాడా అనే చర్చ మొదలైంది.
గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి మరింత స్ట్రాంగ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ను బాబీ మిక్స్ చేస్తున్నట్లు సమాచారం.
సినిమాలో అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఫ్యాన్స్ మాత్రం ఒక్కో అప్డేట్ తో సినిమా రేంజ్ ను అంచనా వేయడం ప్రారంభించారు. మేకింగ్ వీడియోలో కనిపించిన చిరంజీవి ఎనర్జీ, బాబీ రెస్పాన్స్ చూస్తుంటే మెగా 158పై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
