Begin typing your search above and press return to search.

మీరా జాస్మిన్ టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్!

కేర‌ళ కుట్టి మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. తెలుగులో న‌టించింది కొన్ని సినిమాలే? వాటితోనే త‌న‌దైన ముద్ర వేసింది.

By:  Srikanth Kontham   |   18 Feb 2026 10:00 AM IST
మీరా జాస్మిన్  టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్!
X

కేర‌ళ కుట్టి మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. తెలుగులో న‌టించింది కొన్ని సినిమాలే? వాటితోనే త‌న‌దైన ముద్ర వేసింది. అమ్మ‌డు అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. `అమ్మాయి బాగుంది` ,` గుడుంబా శంక‌ర్`, ` భ‌ద్ర‌`, ` రారాజు`, `మ‌హార‌ధి`, `గోరింటాకు` లాంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. తెలుగు సినిమాల‌తో పాటు పేర్ల‌ల‌ల్ గా క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌లో కూడా సినిమాలు చేసింది. అమ్మ‌డు ఎక్కువ‌గా మాతృ భాష‌కు ప్రాధ‌న్యత ఇచ్చి ప‌నిచేసింది. తెలుగులో చివ‌రిగా స్వాగ్ అనే చిత్రంలో న‌టించింది.

వాస్త‌వానికి 2013 త‌ర్వాత కేవ‌లం రెండు తెలుగు సినిమాల్లోనే న‌టించింది. అవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అటుపై 2014లో ధాంపత్య జీవితంలో కి అడుగు పెట్టింది. దీంతో తెలుగు సినిమాల‌కు ప‌ర్తిగా దూర‌మైంది. అప్ప‌టి నుంచి ఇత‌ర భాష‌ల్లోనే బిజీగా కొన‌సాగింది. ప్ర‌స్తుతం మాలీవుడ్, శాండిల్ వుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా మీరాజాస్మిన్ మ‌ళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వేర్వేరు భాష‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్ కొన‌సాగిస్తోన్న నేప‌థ్యంలో తెలుగులో మ‌ళ్లీ ఎందుకు పని చేయ‌కూడ‌దు అన్న ఆలోచ‌న నుంచి అమ్మ‌డు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో ఉన్న పాత ప‌రిచ‌యాల‌తో టాలీవుడ్ మేనేజ‌ర్ల‌కు ట‌చ్ లో కి వెళ్తోంద‌ని తెలిసింది. మీరాజాస్మిన్ వ‌య‌సు 44 ఏళ్లు. కీల‌క పాత్ర‌ల‌ట‌కు..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి అవ‌కాశాలు వ‌స్తాయి. అంత‌కంటే ముందే సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గానూ చెప్పొచ్చు. చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేష్‌, నాగార్జున లాంటి స్టార్ల‌కు మ్యాచ్ అవుతుంది. ఆ న‌లుగురు హీరోల‌కు హీరోయిన్ల స‌మ‌స్య‌ ఎప్పుడూ ఉంటుంది. కాబ‌ట్టి మేక‌ర్స్ సీనియ‌ర్ల‌కు జోడీగా ఎంపిక చేయోచ్చు. వీరితో మీరాజాస్మిన్ న‌టించింది లేదు. త‌ర్వాత త‌రం స్టార్ల‌తోనే సినిమాలు చేసింది. ఈనేప‌థ్యంలో సీనియ‌ర్ల స‌ర‌స‌న ప్రెష్ అప్పిరియ‌న్స్ ఇస్తోంది.

ప్ర‌స్తుతం మాలీవుడ్, క‌న్న‌డ‌లో కూడా సీనియ‌ర్ హీరోల చిత్రాల్లోనే న‌టిస్తోంది. మోహ‌న్ లాల్ హీరోగా న‌టిస్తోన్న 366 చిత్రంలో ఈ భామే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇందులో ఆమె నైసీ అనే పాత్రలో మోహ‌న్ లాల్ కు భార్య గా న‌టిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి న‌టించ‌డం మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం. లాల్ న‌టించిన గ‌త సినిమాల్లోనూ మీరాజాస్మిన్ న‌టించింది. అయితే అవి పూర్తి స్థాయి పాత్ర‌లు కాదు. మీరాజాస్మిన్ న‌టిగా ఎదిగే క్ర‌మంలో వ‌చ్చిన అవ‌కాశాలు అవ‌న్నీ. తాజా అవ‌కాశం ప‌ట్ల అమ్మ‌డు ఎంతో సంతోషంగా ఉంది.