సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో ఛాన్స్ అందుకుందా?
కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాధ్ స్వీయా దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 3 Jan 2026 7:00 PM ISTహర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకుంటోందా? కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్ లతో ఫాలోవర్స్ లో జోష్ నింపబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ అందు కున్నా? 300 కోట్ల వసూళ్ల విజయం అమ్మడి ఖాతాలో ఉన్నా ? ఆ సక్సెస్ క్రేజ్ లో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలైతే అందు కోవడంలో విఫలమైంది. 'అనగనగా ఒక రాజు', 'వృషకర్మ' మినహా కొత్త ప్రాజెక్ట్ లు వేటికి కమిట్ అయిన దాఖాలాలు కనిపించలేదు. కానీ కొత్త ఏడాది ఆరంభంమే అమ్మడి ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది.
కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాధ్ స్వీయా దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'లవ్ టుడే' తర్వాత హీరోగానే బిజీ అయినా ప్రదీప్ ...రెండవ సారి మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కి నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలిసింది. కోలీవుడ్ హీరోయిన్లు అందుబాటులో? ఉన్నా తాను రాసిన పాత్రకు మీనాక్షి పర్పెక్ట్ గా యాప్ట్ అవుతుందని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ మార్క్ లవ్ స్టోరీ యూత్ పుల్ ఎంటర్ టైనర్ కాదిది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రదీప్ ఓ సరికొత్త ప్రయోగం ఇది.
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. హీరో పాత్రతో పాటు హీరోయిన్ సహా మరో మూడు పాత్రలు ప్రధానంగా సాగే కథ ఇది. ఆ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉండనుంది. వాటిలో మరో ఇద్దరు పేరున్న హీరోయిన్లనే తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. మీనాక్షి విషయానికి వస్తే ఈ సినిమాతో పాటు తమిళ్ లో మరో రెండు చిత్రాలకు కూడా కమిట్ అయిందని సమాచారం. శివ కార్తికేయన్ హీరోగా ప్రారంభం కానున్న కొత్త చిత్రంలోనూ ఈ భామే హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. అలాగే కార్తీ కథానాయకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనూ మీనాక్షి హీరోయిన్ అనే వార్తలొస్తున్నాయి.
మీనాక్షి ఇప్పటికే కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించింది. దళపతి విజయ్ కి జోడీగా 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' లోనూ, విజయ్ ఆంటోనీ సరసన 'కోలై' చిత్రంలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయినా వాటి వైఫల్యాలతో సంబంధం లేకుండా కోలీవుడ్ లో కొత్త అవకాశాలు అందుకుంటుంది. అలాగే కొత్త ఏడాదిలో తెలుగులోనూ మీనాక్షి అవకాశాలు అందుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సంక్రాంతి సంద ర్భంగా అమ్మడు నటించిన 'అనగనగా ఒక రాజు' రిలీజ్ అవుతుంది. అలాగే 'వృషకర్మ' లాంటి చిత్రాలు మంచి ఫలితాలు సాధిస్తే? అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.
