Begin typing your search above and press return to search.

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయ్యేనా?

టాలీవుడ్‌లో 2024లో అరడజను సినిమాలతో సందడి చేసిన మీనాక్షి చౌదరికి ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘అనగనగా ఒక రాజు’ విజయాలు కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఇప్పుడు నాగచైతన్యతో నటించిన ‘వృశకర్మ’పై ఆశలు పెట్టుకుంది. అలాగే కార్తీ 30లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

By:  Ramesh Palla   |   27 Nov 2026 4:00 AM IST
మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయ్యేనా?
X

టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసి మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో టాప్‌ హీరోయిన్‌గా ఒక ఊపు ఊపుతుందని అంతా భావించారు. కట్‌ చేస్తే ఆమె సినిమాల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. 2024 లో మీనాక్షి నుంచి ఏకంగా అరడజను సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఎక్కువ శాతం ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఏడాది అంటే 2025 లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషించడంతో పాటు, కామెడీ చేసి నవ్వించింది. అయినా కూడా మీనాక్షి చౌదరికి లక్‌ కలిసి రాలేదు. సంక్రాంతి హిట్‌ ఆమెకు కలిసి రాలేదు. 2025లో మరే సినిమాను ఆమె చేయలేదు. ఆ ఏడాది మరే సినిమాతో ఆమె రాలేదు. 2026లో అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా కామెడీతో మెప్పించింది, కానీ మీనాక్షికి కలిసి రాలేదు.

వృశకర్మ సినిమాతో...

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ చైతన్య హీరోగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన 'వృశకర్మ' తో మీనాక్షి తన అదృష్టం పరీక్షించుకోబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ లో మీనాక్షి లుక్‌ ఆసక్తికరంగా ఉంది. ఒక సీరియస్‌ పాత్రను ఈమెతో దర్శకుడు చేయించినట్లుగా ఉన్నాడు. కనుక తప్పకుండా వృశకర్మ సినిమాతో మీనాక్షి చౌదరికి మంచి పేరు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఆమె అభిమానులు భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో మీనాక్షి పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమాతో మీనాక్షి చౌదరి మరిన్ని సినిమాలను దక్కించుకుంటుందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వృశకర్మ వచ్చిన తర్వాత కొత్త సినిమాలకు సైన్ చేస్తాను అంటూ ఇటీవల ఒక చిట్‌ చాట్‌ సందర్భంగా సన్నిహితులతో మీనాక్షి చెప్పినట్లు సమాచారం.

నాగ చైతన్య సినిమాలో మీనాక్షి చౌదరి...

వృశకర్మ కాకుండా మీనాక్షి చౌదరి ఒక తమిళ సినిమాను చేస్తుంది. కార్తీ 30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్నట్లుగా గతంలో ప్రకటన వచ్చింది. చాలా రోజులుగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మీనాక్షి చౌదరి సైతం సోషల్‌ మీడియాలో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ ఆ విషయం గురించి ఇప్పటి వరకు చెప్పలేదు. దాంతో ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్తీ కెరీర్‌ ఇప్పుడు కాస్త అటు ఇటుగా ఉంది. ఆయన చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ బొక్క బోర్లా పడుతున్నాయి. అయినా కూడా ఆయన నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న కార్తీ 30 సినిమా హిట్‌ అయితే మీనాక్షి చౌదరికి కూడా ఒక హిట్ పడ్డట్లు అవుతుంది. ఈ ఏడాది వృశకర్మ, వచ్చే ఏడాది కార్తీ30 సినిమాతో హిట్‌ కొడితే మళ్లీ మీనాక్షి బిజీ అవుతుందేమో చూడాలి.

టాలీవుడ్‌లో వరుస సినిమాలు...

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నారు. ఒకప్పుడు వరుసగా హిట్స్ అందుకుంటే స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కేవి, దాంతో ఐదు నుంచి పదేళ్ల పాటు ఇండస్ట్రీలో పదిలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్క ఫ్లాప్ పడితే ఆ హీరోయిన్‌ కనిపించకుండా పోతుంది. హిట్‌ కొట్టిన హీరోయిన్స్‌ కూడా చాలా మంది కనిపించడం లేదు. అందుకు కారణాలు ఏంటి అనేది ఏ ఒక్కరూ చెప్పలేక పోతున్నారు. కొత్త వారు కావాలని ఫిల్మ్‌ మేకర్స్ చూస్తూ ఉన్నారు. పాత హీరోయిన్స్‌ విషయంలో చిన్న చూపు చూస్తున్నారు. అతి కొద్ది మంది హీరోయిన్స్ రిపీట్‌ అవుతున్నారు. కానీ కొంత మంది హీరోయిన్స్‌ ను మాత్రం పూర్తిగా పక్కన పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే మీనాక్షి బ్యాక్ టు బ్యాక్‌ రెండు సినిమాలతో రాబోతున్న నేపథ్యంలో మళ్లీ ఆమె బిజీ అయ్యి, అభిమానులను అలరిస్తుందా అనేది చూడాలి.