గార్జియస్ లుక్ లో అలరిస్తున్న మీనాక్షి చౌదరి!
మీనాక్షి చౌదరి.. అందంతో అలరారుతూ చూపరులను విపరీతంగా ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 8 Feb 2026 11:09 PM ISTమీనాక్షి చౌదరి.. అందంతో అలరారుతూ చూపరులను విపరీతంగా ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు అభిమానుల ఫేవరెట్ హీరోయిన్ గా మారిన ఈమె, ఈమధ్యకాలంలో సంక్రాంతికి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రతి సంక్రాంతికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది. అలా 2024లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమాతో మొదటి సంక్రాంతి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో మీనాక్షితో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్గా నటించింది. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది మీనాక్షి.
అలాగే ఈ ఏడాది ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన 'అనగనగా ఒక రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలా 2026 సంక్రాంతి లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి. అలా వరుసపెట్టి సంక్రాంతి సినిమాలతో సక్సెస్ అందుకుంటూ సంక్రాంతి హీరోయిన్గా హ్యాట్రిక్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా .. 'విరూపాక్షా' సినిమాతో సంచలనం సృష్టించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మీనాక్షి.. మరొకవైపు అభిమానులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసే ఈమె.. తాజాగా అద్భుతమైన ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా బ్లాక్ కలర్ టీ షర్టు ధరించి మల్టీకలర్ షాట్ ధరించిన ఈమె.. తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. సింపుల్ లుక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది మీనాక్షి చౌదరి. పైగా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా" ప్రజల డిమాండ్ మేరకు ఈ సెట్ ను తిరిగి పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇది కూడా నాకు ఇష్టమైన ఫోటోలో ఒకటి" అంటూ పంచుకుంది.
ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అద్భుతం, లక్కీ లేడీ అంటూ పలు రకాల కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఓరి దేవుడా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు ఈ అమ్మాయి మన హృదయాన్ని దోచుకుంటుంది అంటూ ఇలా ఎవరికి వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే మీనాక్షి షేర్ చేసిన ఈ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
