Begin typing your search above and press return to search.

కొంటెగా కవ్విస్తున్న మీనాక్షి..

ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి కొంటెగా కవ్విస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

By:  Madhu Reddy   |   27 Jan 2026 2:02 PM IST
కొంటెగా కవ్విస్తున్న మీనాక్షి..
X

కాస్త గ్యాప్ దొరికితే చాలు సోషల్ మీడియాలో దూరిపోయే సెలబ్రిటీలు ఈమధ్య మరింత ఎక్కువైపోయారు. అందులో భాగంగానే సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తో పాటు తమ ఉనికిని చాటుకోవడానికి ఇలా అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది లంగా ఓణీలలో.. చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి కొంటెగా కవ్విస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.




ఎల్లో, మెరూన్ రెడ్ కాంబినేషన్లో ఉన్న లంగావోణీ ధరించిన ఈమె.. తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. కొంటెగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.." కొంచెం నాటీ..కొంచెం స్వీట్" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం మీనాక్షి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె అందాన్ని చూసి అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. అంతేకాదు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది నెటిజన్స్ మీనాక్షి అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇంకొంతమంది మీనాక్షి మన ఇంటి అమ్మాయి అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.




మీనాక్షి మోడల్ గా తన కెరీర్ను ఆరంభించింది. 2018 లో మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు తెరకు పరిచయమైంది . ఇకపోతే ఈ సినిమా సమయంలోనే సుశాంత్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త అప్పుడప్పుడు కలిసి కనిపించే రేంజ్ కి వెళ్ళింది. అయితే ఇది చూసిన చాలామంది వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టింది మీనాక్షి.




ఇకపోతే మీనాక్షి సంక్రాంతి హీరోయిన్ గా హ్యాట్రిక్ అందుకుంది. 2024 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయం అందుకుంది. ఇక 2025న మళ్లీ సంక్రాంతికి వెంకటేష్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా వరుసగా మూడు సంవత్సరాల పాటు సంక్రాంతికి వస్తూ మంచి విజయాలను అందుకొని.. సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది మీనాక్షి చౌదరి.