Begin typing your search above and press return to search.

గామా అవార్డ్స్ 2025.. చీరకట్టులో కూడా హీట్ పుట్టించిన మీనాక్షి!

ఇక ఇప్పుడు ఈ ఈవెంట్లో అవార్డు అందుకోవడానికి వెళ్లిన మీనాక్షి చౌదరి అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Madhu Reddy   |   2 Sept 2025 10:03 PM IST
గామా అవార్డ్స్ 2025.. చీరకట్టులో కూడా హీట్ పుట్టించిన మీనాక్షి!
X

దుబాయ్ లో అట్టహాసంగా గామా అవార్డ్స్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో చాలామంది సినీ సెలబ్రిటీలు తమ సినిమాలతో అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నార్త్ మాత్రమే కాదు సౌత్ సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులకు ఈ ఈవెంట్ కు రావాలని ఆహ్వానందిన విషయం తెలిసిందే. అందులో అవార్డు అందుకోబోయే వారు మాత్రమే కాకుండా ఇక్కడ సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలు అయిపోయిన వారికి కూడా ఆహ్వానం లభించింది. ఉదాహరణకు కోర్టు సినిమాతో సంచలనం సృష్టించిన కాకినాడ శ్రీదేవికి కూడా ఈవెంట్ కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.


గామా అవార్డ్స్ వేడుకల్లో సందడి చేసిన మీనాక్షి..

ఇక ఇప్పుడు ఈ ఈవెంట్లో అవార్డు అందుకోవడానికి వెళ్లిన మీనాక్షి చౌదరి అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఈమె నటించిన లక్కీ భాస్కర్ సినిమాలోని పాత్రకు గానూ ఈమెకు గామా అవార్డు లభించగా.. అవార్డు అందుకోవడానికి వెళ్లిన మీనాక్షి చౌదరి అక్కడ తన లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా క్రీం కలర్ నెట్టెడ్ శారీ ధరించిన ఈమె.. అందాలతో హీట్ పెంచింది అని చెప్పవచ్చు. క్రీం కలర్ నెట్టెడ్ శారీ పై వైట్ కలర్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఈ శారీ అద్భుతంగా అనిపిస్తోంది. దీనికి కాంబినేషన్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. ముఖ్యంగా తన లుక్కును మరింత పెంచుకునేలా సింపుల్ జువెలరీని ధరించింది. ఓవరాల్ గా దుబాయ్ ఈవెంట్లో మీనాక్షి చౌదరి తన అందాలతో అందరిని కట్టిపడేసింది అని చెప్పవచ్చు.


మీనాక్షి చౌదరి కెరియర్..

ఇక మీనాక్షి చౌదరి కెరియర్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన మీనాక్షి చౌదరి.. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. 2021 లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత రవితేజ తో ఖిలాడి, అడవి శేషుతో 'హిట్ : ది సెకండ్ కేసు' చిత్రాలలో నటించి మంచి విజయం అందుకుంది. తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ చిత్రాలలో కూడా నటించిన ఈమె హిందీ టెలివిజన్ సిరీస్ 'అవుట్ ఆఫ్ లవ్' లో నటించింది అలాగే మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది మీనాక్షి చౌదరి.


మీనాక్షి చౌదరి బాల్యం, విద్యాభ్యాసం..

మీనాక్షి చౌదరి బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. 1996 మార్చి 5న హర్యానా, పంచ్ కులాలో జన్మించింది ఈమె పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్స్ కూడా పూర్తి చేసింది.