చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్ కామెంట్స్
‘వృషకర్మ’లో తొలిసారి నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న మీనాక్షి చౌదరి.. ఆయన సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీపై ప్రశంసలు కురిపించింది. ఎన్ని రీటేక్స్ అయినా విసుగు చూపకుండా, తోటి నటీనటులకు కంఫర్ట్ ఇస్తారని తెలిపింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.
By: Ramesh Palla | 19 Nov 2026 3:24 PM ISTనాగ చైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన 'వృషకర్మ' రిలీజ్‌కి అంతా రెడీ అయింది. కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం అయిన ఈ సినిమాను డిసెంబర్ 4, 2026న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడీగా మీనాక్షి చౌదరి నటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వరుస విజయాలు దక్కిన సమయంలో అనూహ్యంగా సైలెంట్ అయిన మీనాక్షి చౌదరి మళ్లీ ఇప్పుడు వృషకర్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా చైతన్య గురించి మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య వృషకర్మ మూవీ...
వృషకర్మ సినిమా కోసం మొదటి సారి నాగ చైతన్య తో జత కట్టిన మీనాక్షి చౌదరి ఆయన సింప్లిసిటీ చూసి ఫిదా అయిందట, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీని చూసి షాక్ అయ్యాను అంది. ఇంకా మీనాక్షి చౌదరి తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి మాట్లాడుతూ... నాగ చైతన్య గారితో ఈ సినిమా కోసం మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాను. ఆయన చాలా సింపుల్ అండ్ వర్క్ మైండెడ్. ఒక సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా రావడానికి ఎన్ని టేక్‌లు అయినా సరే చేసేందుకు రెడీ అంటాడు. ఎన్ని సార్లు రీ టేక్ చేసినా ఇబ్బంది పడకుండా నవ్వుతూనే ఉంటారు. ఆయన మొహంలో విసుగు అనేది కనిపించదు. ఆయన ఎప్పుడు చాలా సింపుల్‌గా కనిపిస్తూ ఉంటారు. తోటి నటీనటులకు కంఫర్ట్ ఇవ్వడం ద్వారా వారి నుంచి బెస్ట్ ఔట్ పుట్ వచ్చేలా నాగ చైతన్య చూస్తారు. ఆయనతో వర్క్ చేసే వారికి ఒత్తిడి అనేది లేకుండా మంచి వాతావరణం కల్పిస్తూ ఉంటాడు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ...
ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చిన, లెజెండ్రీ ఫ్యామిలీ వారసుడు అయినప్పటికీ నాగ చైతన్య లో ఇసుమంత అయినా ఈగో ఉండదు అని గతంలోనూ చాలా మంది ఆయనతో వర్క్ చేసిన వారు మాట్లాడిన విషయం తెల్సిందే. ఆయన చాలా సింపుల్‌గా, ఎంత పెద్ద విషయం అయినా తేలికగా తీసుకుని, అవతలి వారిని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడుతాడని చాలా మంది అంటారు. ఇప్పుడు ఆయనతో వర్క్ చేసిన మీనాక్షి చౌదరి సైతం అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సినిమాలో తనతో వర్క్ చేసే వారి పట్ల అంత మర్యాదగా, కేరింగ్‌గా ఉండే నాగ చైతన్య తన కుటుంబ సభ్యుల పట్ల ఎంత కేరింగ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ఎంపిక విషయంలో స్లో ఉన్న నాగ చైతన్య మంచి కంటెంట్‌తో రావాలనే ఉద్దేశంతో ఓపిక పట్టి మరీ కథలు ఎంపిక చేసుకుంటున్నాడని ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో...
ఇక వృషకర్మ సినిమా విషయానికి వస్తే దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను చాలా స్పెషల్ మూవీగా రూపొందించాడట. ఈయన దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు మించి వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. దాంతో తనపై పెరిగిన బాధ్యతను మోసేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఫైనల్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఈ సినిమాను సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. మొత్తానికి ఈ సినిమాతో నాగ చైతన్య మరోసారి రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల కాబోతున్న వృషకర్మ సినిమా ఏమేరకు సక్సెస్‌ను దక్కించుకుంటుంది అనేది చూడాలి.
