ఏడాది తర్వాత బిజీ అయిన ముద్దుగుమ్మ..!
2024 సంవత్సరంలో అరడజను సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకుని, ఆ ఏడాది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
By: Ramesh Palla | 12 Oct 2026 8:00 PM IST2024 సంవత్సరంలో అరడజను సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకుని, ఆ ఏడాది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. సాధారణంగా హీరోయిన్స్ వరుసగా హిట్స్ పడితే మరింత జోష్‌తో సినిమాలకు కమిట్ అయ్యి, తమ సినిమాల సంఖ్య అమాంతం పెంచుకుంటారు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం తన సినిమాల సంఖ్య ను పెంచుకోలేదు సరి కదా, గత ఏడాది మొత్తంలో ఆమె నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది. ఇక ఈ ఏడాదిలోనూ ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ఇప్పటి వరకు వచ్చింది. ఈ ఏడాదిలో మరో సినిమాతో వచ్చేనా లేదా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మీనాక్షి చౌదరి సినిమాలు ఎందుకు తగ్గాయి అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో ఉన్నప్పటికీ మీనాక్షి చౌదరి ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా...
అందంతో పాటు, మంచి ప్రతిభ ఉన్న మీనాక్షి చౌదరి నుంచి ఎక్కువ సినిమాలు రాకపోవడం ను అభిమానులు తప్పుబడుతున్నారు. కారణం ఏదైనా మీనాక్షి సినిమాలు రాకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా మీనాక్షి చౌదరికి మెసేజ్‌లు చేస్తూ వరుస సినిమాలు కమిట్ కావాలని కోరుతూ ఉన్నారట. ఫైనల్‌గా మీనాక్షి చౌదరి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్యతో కలిసి నటించిన వృషకర్మ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత తమిళ హీరో కార్తీతో ఒక సినిమాను మీనాక్షి చేయబోతుంది. ఆ సినిమా వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాలోనూ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నితిన్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో...
ప్రస్తుతం నటిస్తున్న రెండు మూడు సినిమాలు కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ముఖ్యంగా నితిన్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నితిన్ సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయిందని, సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుంది. మీనాక్షి డేట్లు ఇప్పటికే తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నితిన్, మీనాక్షి చౌదరి కాంబో కచ్చితంగా మంచి జంట అవుతుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
మీనాక్షి చౌదరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు...
గత ఏడాది, ఈ ఏడాది పెద్దగా సినిమాలు చేయని మీనాక్షి చౌదరి రాబోయే రెండేళ్లు బిజీ బిజీగా వరుస సినిమాల షూటింగ్స్ కు హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మీనాక్షి చౌదరి నుంచి కనీసం మూడు లేదా నాలుగు సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా వచ్చిన గ్యాప్ ను వరుస సినిమాలు చేయడం ద్వారా మీనాక్షి చౌదరి ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తక్కువ సమయంలోనే స్టార్‌డం దక్కించుకున్న మీనాక్షి చౌదరి ముందు ముందు టాలీవుడ్ స్టార్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్‌గా మారినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి మీనాక్షి చౌదరి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముద్దుగుమ్మ బిజీ కావడంతో పాటు, ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని అభిమానులు కోరుకుంటూ వచ్చారు, వారి కోరిక వచ్చే ఏడాది తీరనుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నితిన్‌తో మూవీకి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
