Begin typing your search above and press return to search.

స్టైల్‌తో పాటు సంప్రదాయం.. మీనాక్షి చౌదరి న్యూ ట్రావెల్ వైబ్!

నేపాల్‌లోనే అత్యంత పురాతనమైన, పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రం బ్యాక్‌డ్రాప్‌లో మీనాక్షి ఈ ఫోటోలు దిగారు.

By:  Madhu Reddy   |   24 Jun 2026 6:36 PM IST
స్టైల్‌తో పాటు సంప్రదాయం.. మీనాక్షి చౌదరి న్యూ ట్రావెల్ వైబ్!
X

టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటారు. తన గ్లామరస్, స్టైలిష్ లుక్స్‌తో యూత్‌ను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన బిజీ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని నేపాల్ వెళ్లారు.

అక్కడ దిగిన బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. "నేపాల్ ఎడిషన్ బోలెడన్ని మోమోస్, గుళ్లు, మరియు సరళత్వంలోనే అందం" అంటూ క్యాప్షన్ పెట్టారు. స్టైల్‌తో పాటు ట్రెడిషన్‌ను మిక్స్ చేసిన ఆమె లేటెస్ట్ ట్రావెల్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..

నేపాల్ పురాతన కట్టడాల్లో మీనాక్షి సందడి:

నేపాల్‌లోనే అత్యంత పురాతనమైన, పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రం బ్యాక్‌డ్రాప్‌లో మీనాక్షి ఈ ఫోటోలు దిగారు. చుట్టూ దట్టమైన చెట్లు, పొడవైన రాతి మెట్లు, సాంప్రదాయ చిన్న రాతి స్తూపాలు, కలర్‌ఫుల్ బౌద్ధ ప్రార్థన జెండాల మధ్య ఆమె నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. అక్కడ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాల మధ్య మోడ్రన్ ట్రావెల్ వైబ్స్‌తో మీనాక్షి ఎంతో హుందాగా కనిపించారు.

స్టైలిష్ లుక్ :

ఈ టూర్‌లో మీనాక్షి వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ ఫ్యాషన్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఆమె బ్లాక్ క్రాప్ టాప్‌పై, వైట్ షార్ట్-స్లీవ్ షర్టును ష్రగ్‌లా లూజ్‌గా వేసుకున్నారు. దీనికి మ్యాచ్ చేస్తూ కింద రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో ఉన్న జైపురి స్టైల్ మ్యాక్సీ స్కర్ట్ ధరించారు. ఇక ఈ ట్రెడిషనల్ స్కర్ట్‌తో పాటు తలపై ఒక క్లాసీ హెడ్‌స్కార్ఫ్, స్టైలిష్ రౌండ్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని మోడ్రన్ లుక్‌కి కాస్త ట్రెడిషనల్ టచ్ ఇచ్చి అదరగొట్టేశారు.

బాక్సాఫీస్ వద్ద 'అన్‌స్టాపబుల్' జోరు:

కేవలం సోషల్ మీడియాలోనే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా మీనాక్షి చౌదరి హవా మామూలుగా లేదు. ఇక దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' బ్లాక్‌బస్టర్లతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసారు. ఇక విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’, నవీన్ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలతో పాటు, నాగచైతన్యకు జోడీగా రాబోతున్న ‘వృషకర్మ’ లాంటి భారీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు.

వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఇలా ప్రకృతి ఒడిలోకి వెళ్లి రీఛార్జ్ అవ్వడం మీనాక్షికి అలవాటే. నేపాల్ సంస్కృతిని గౌరవిస్తూ, అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఆమె షేర్ చేసిన పిక్స్ చూస్తే ఎవరికైనా ట్రావెల్ చేయాలనే మూడ్ రావడం ఖాయం. ఇక గ్లామర్ పాత్రలైనా, నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లైనా మీనాక్షి రూటే వేరు అని ఈ ఫోటోలు మరోసారి నిరూపించాయి. ఈ క్రేజీ బ్యూటీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.