లవ్ లైఫ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మీనాక్షి చౌదరి..!
హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రేమ, క్రష్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఎవరిపైనా క్రష్ లేదని, తన జీవితమే ఇప్పటికే క్రష్ అయిపోయిందంటూ సరదాగా సమాధానమిచ్చింది. ప్రేమలో పడటం, రిలేషన్షిప్ నుంచి బయటకు రావడం రెండూ కష్టమేనని చెప్పింది. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తోంది.
By: Priya Chowdhary Nuthalapti | 22 Nov 2026 10:01 AM ISTటాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన సినిమాలతోనే కాకుండా, అప్పుడప్పుడు చేసే ఆసక్తికర వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ప్రేమ, రిలేషన్షిప్స్కు సంబంధించిన విషయాల్లో ఆమె చెప్పే సమాధానాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు క్రష్ ఎవరైనా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ నవ్విస్తోంది.
గతంలో మీనాక్షి చౌదరి ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో ఉందంటూ కొన్ని వార్తలు, రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ విషయాన్ని చర్చలోకి తీసుకొచ్చాయి.
ప్రస్తుతం మీనాక్షి చౌదరి నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషకర్మ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్, అడ్వెంచర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాగచైతన్య ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీనాక్షి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా యాంకర్ ఆమెను ప్రస్తుతం ఎవరిపైనైనా క్రష్ ఉందా అని అడిగారు. దీనికి మీనాక్షి నవ్వుతూ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "నాకు ఎవరిపైనా క్రష్ లేదు. నా జీవితమే ఇప్పటికే క్రష్యడు అయిపోయింది" అంటూ సరదాగా బదులిచ్చింది.
అంతేకాదు, ప్రేమలో పడటం కష్టమా? లేదా ఓ రిలేషన్షిప్ నుంచి బయటకు రావడం కష్టమా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి కూడా మీనాక్షి ఆసక్తికరంగా స్పందించింది. "నాకు తెలియదు కానీ.. రెండూ కష్టమే" అని చెప్పింది.
ఇక వృషకర్మ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ హీరోయిన్ కి ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాలి.
