Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ లోకి గుంటూరు పిల్ల‌!

తాజాగా అది నిజ‌మేన‌ని క‌న్ప‌మ్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మీనాక్షి బాలీవుడ్ లో లాంచ్ అవ్వ‌లేదు. దీంతో ఇదే బాలీవుడ్ డెబ్యూ అవుతుంది.

By:  Srikanth Kontham   |   28 Sept 2025 9:00 PM IST
యాక్ష‌న్ లోకి గుంటూరు పిల్ల‌!
X

మీనాక్షి చౌద‌రి కి చెప్పుకోవ‌డానికి స‌క్సెస్ లున్నా? చేతిలో అవ‌కాశాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం `అన‌గ‌నగా ఒక రోజు` చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో న‌టిస్తోన్న ఒకే ఒక్క చిత్ర‌మిది. ఇలాంటి స‌మ‌యంలోనే ప‌క్క ప‌రిశ్ర‌మ‌లు అనుకోకుండా ఆదుకుంటాయి. అది మీనాక్షి విష‌యంలో కూడా ప్రూవ్ అవుతుంది. ఇటీవ‌లే బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `ఫోర్స్` లో ఛాన్స్ అందుకుంటున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. తాజాగా అది నిజ‌మేన‌ని క‌న్ప‌మ్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మీనాక్షి బాలీవుడ్ లో లాంచ్ అవ్వ‌లేదు. దీంతో ఇదే బాలీవుడ్ డెబ్యూ అవుతుంది.

అలియాభ‌ట్ నో చెప్ప‌డంతో:

ఇందులో అమ్మ‌డు జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేయ‌బోతుంది. అంతేకాదు మీనాక్షి పాత్ర ప‌వ‌ర్ పుల్ గానూ ఉంటుంది. ఇది పూర్తి యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్రం కావ‌డంతో మీనాక్షి పాత్ర కూడా యాక్ష‌న్ తోనే నిండి ఉంటుంది. దీనిలో భాగంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు సంబంధించి వ‌ర్క్ షాపుల‌కు కూడా హాజ‌ర‌వుతుంద‌న్న‌ది తాజా స‌మాచారం. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ నేప‌థ్యంలోనే మీనాక్షి పాత్ర‌ను ఫైన‌ల్ చేసి వ‌ర్క్ షాప్ లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ పాత్ర కోసం బాలీవుడ్ లో అలియాభ‌ట్ ని ట్రై చేసారు.

ఇక‌పై బాలీవుడ్ పై ఫోక‌స్:

కానీ అలియా భ‌ట్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా డేట్లు ఇవ్వ‌లేక‌పోయింది. దీంతో ఆ ఛాన్స్ మీనాక్షికి వ‌రించింది. స‌రిగ్గా టాలీవుడ్ లో అవ‌కాశాలు లేని స‌మ‌యంలో వ‌చ్చిన అవ‌కాశం కావ‌డంతో మీనాక్షి ఆనందంతో ఉబ్బిత‌బ్బిబుతోంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే అమ్మ‌డు బాలీవుడ్ లో స్థిరప‌డే అవ‌కాశాలున్నాయి. కెరీర్ టాలీవుడ్ లో మొద‌లైన ఏ న‌టి అయినా అంతిమంగా బాలీవుడ్ లో స్థిర‌ప‌డాల‌నే గోల్ తోనే ఉంటారు. తాజా ప‌రిస్థితుల నేప‌త్యంలో మీనాక్షి ఇక‌పై బాలీవుడ్ పై ఫోక‌స్ చేసే అవ‌కాశం ఉంది.

ఓ సంచ‌ల‌న ప్రాంచైజీ ఇది:

ఫోర్స్ బాలీవుడ్ హిట్ ప్రాంచైజీలో ఒక్క‌టి. ఏసీపీ య‌శ్వ‌ర్ద‌న్ సింగ్ పాత్ర‌లో జాన్ పోర్స్ సినిమాతో ఎంత ఫేమ‌స్ అయ్యాడు. అప్ప‌టి నుంచి `ఫోర్స్` అన్న‌ది ఓ ప్రాంచైజీ గా మారిపోయింది. ఈ ప్రాంచైజీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ అయిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఈనేప‌థ్యంలో `ఫోర్స్ 3`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డు తున్నాయి. జాన్ అబ్ర‌హం ఏసీపీ య‌శ్వ‌ర్ద‌న్ సింగ్ పాత్ర‌ను బ‌లంగా న‌మ్మ‌డంతో మ‌రోసారి పోర్స్ ప్రాంచైజీని రీబూట్ చేస్తున్నారు. ఈసారి ద‌ర్శ‌క‌త్వం బాధ‌త్య‌లు భావ్ దూలియాకు అప్ప‌గించారు.