భీమవరం బాల్మతో 'పోలిశెట్టి' రచ్చ.. మీనాక్షితో కలర్ ఫుల్ లుక్
ముఖ్యంగా ఈ పాట లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాట పేరు 'భీమవరం బాల్మ' కాబట్టి, ఈవెంట్ ను కూడా భీమవరంలోనే ప్లాన్ చేశారు.
By: M Prashanth | 25 Nov 2025 11:12 PM ISTపండగ ఇంకా రాలేదు కానీ, అప్పుడే సంక్రాంతి కళ వచ్చేసినట్లుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. అందులో కనిపిస్తున్న జోడీని, ఆ బ్యాక్ గ్రౌండ్ లోని లైటింగ్స్ ని చూస్తుంటే.. థియేటర్లో జాతర జరగడం ఖాయం అనిపిస్తోంది. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న 'రాజు' గారు, సడెన్ గా ఇలా మాస్ లుక్ లో దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్ ను వదిలారు. ఇందులో వీరిద్దరూ కలిసి వేస్తున్న స్టెప్పు చూస్తుంటే, రాబోయే పాట ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. "భీమవరం బాల్మ" అంటూ సాగే ఈ మాస్ నంబర్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
ఈ పోస్టర్ లో నవీన్ పోలిశెట్టి డ్రెస్సింగ్ స్టైల్ హైలైట్ గా నిలిచింది. బ్లూ కలర్ ప్రింటెడ్ షర్ట్, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన జీన్స్ వేసుకుని ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక మీనాక్షి చౌదరి పట్టు పరికిణీలో, ట్రెడిషనల్ గా కనిపిస్తూనే గ్లామర్ టచ్ ఇచ్చింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ స్మైల్, ఆ ఎనర్జీ చూస్తుంటే సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా.
ముఖ్యంగా ఈ పాట లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాట పేరు 'భీమవరం బాల్మ' కాబట్టి, ఈవెంట్ ను కూడా భీమవరంలోనే ప్లాన్ చేశారు. అక్కడి ఎస్.కె.ఆర్.కె (SKRK) ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 27న గ్రాండ్ గా ఈ సాంగ్ లాంచ్ జరగనుంది. స్టూడెంట్స్ మధ్య నవీన్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఈ పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2026 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
