Begin typing your search above and press return to search.

లైఫ్ లో అదొక్క‌టే చాలంటున్న హీరోయిన్

రీసెంట్ గా మీనాక్షి ఓ పార్టీకి వెళ్ల‌గా, అక్క‌డ తీసిన వీడియో బ‌య‌టికొచ్చింది. ఈ వీడియోలో మీనాక్షి సెల‌బ్రిటీలాగా కాకుండా అందరిలాగానే చాలా నేచుర‌ల్ గా భోజ‌నం చేస్తూ క‌నిపించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Feb 2026 6:28 PM IST
లైఫ్ లో అదొక్క‌టే చాలంటున్న హీరోయిన్
X

మూవీ ఇండ‌స్ట్రీలో ఉండాలంటే సెల‌బ్రిటీలు త‌మ యాక్టింగ్ తోనే కాదు, త‌మ అందం, ఫిట్‌నెస్‌ తో కూడా ఆడియ‌న్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు మెప్పిస్తూనే ఉండాలి. అలా చేయ‌లేక‌పోతే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో పాటూ ఆడియ‌న్స్ దృష్టి కూడా వేరే వారివైపు మ‌ళ్లుతుంది. అందుకే అందంగా, ఫిట్‌గా క‌నిపించ‌డానికి న‌టీన‌టులు చాలా క‌ష్ట‌ప‌డుతూ ఉంటారు.

బ‌రువు కొంచెం కూడా పెర‌గ‌కుండా, త‌గ్గ‌కుండా ఎప్పుడూ ఒకే లుక్ ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. అందులో భాగంగానే సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా జిమ్ లో త‌మ స‌మ‌యాన్ని గ‌డుపుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పేరుకే సెల‌బ్రిటీలు కానీ వాళ్లు కావాలనుకున్న‌ది వాళ్లు తిన‌డానికి ఎన్నో విష‌యాలు అడ్డొస్తుంటాయి.

ఫుడ్ విష‌యంలో నో రూల్స్

ఇది తింటే ఏమ‌వుతుందో? అది తింటే ఏమ‌వుతుందో అని క్యాల‌రీలు లెక్కేసుకుని మ‌రీ తింటారు. అందుకే చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన‌వన్నీ తినకుండా నోరు క‌ట్టేసుకుని ఉంటారు. కానీ టాలీవుడ్ ల‌క్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌద‌రి మాత్రం ఫుడ్ విష‌యంలో ఎలాంటి రిస్ట్రిక్ష‌న్స్ వ‌ద్దంటున్నారు. రీసెంట్ గా ఆమె ఫుడ్ గురించి మాట్లాడుతున్న వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది.

స్ట్రెస్ వ‌ద్దంటున్న మీనాక్షి

రీసెంట్ గా మీనాక్షి ఓ పార్టీకి వెళ్ల‌గా, అక్క‌డ తీసిన వీడియో బ‌య‌టికొచ్చింది. ఈ వీడియోలో మీనాక్షి సెల‌బ్రిటీలాగా కాకుండా అందరిలాగానే చాలా నేచుర‌ల్ గా భోజ‌నం చేస్తూ క‌నిపించారు. అంతేకాదు, భోజ‌నం చేస్తూ మీనాక్షి చెప్పిన మాట‌లు అందరినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఆ వీడియోలో మీనాక్షి, లైఫ్ లో స్ట్రెస్ ఇదంతా ఏమీ వ‌ద్దు, ఓన్లీ ఫుడ్డు అని న‌వ్వుతూ చెప్పగా, వీడియో తీస్తున్న వ్య‌క్తి ఇది ఈ డికేడ్ లోనే బెస్ట్ మోటివేష‌న‌ల్ వీడియో అంటుంటే, కాదు, సెంచురీ అంటూ మీనాక్షి మ‌ళ్లీ తిన‌డం కంటిన్యూ చేయ‌డంతో ఈ వీడియో అంద‌రినీ తెగ ఎట్రాక్ట్ చేస్తుండ‌గా, నెటిజ‌న్లు ఈ వీడియోను లైక్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

సెల‌బ్రిటీ అయిన‌ప్ప‌టికీ మీనాక్షి ఇలా సింపుల్ గా ఫుడ్ గురించి చెప్పిన మోటివేష‌న్ బావుంద‌ని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక కెరీర్ విష‌యానికొస్తే, రీసెంట్ గా అనగ‌న‌గా ఒక రాజు మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న మీనాక్షి చేతిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అక్కినేని నాగ చైత‌న్యతో పాటూ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తో కూడా మీనాక్షి సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా ఉన్నారు.